Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా దండుపాళ్యం గ్యాంగ్ 'తగ్గేదే లే' టీజర్..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 5:46 AM GMT
ఆసక్తికరంగా దండుపాళ్యం గ్యాంగ్ తగ్గేదే లే టీజర్..!
X
'దండుపాళెం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విలక్షణ ద‌ర్శ‌కుడు శ్రీనివాస రాజు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''తగ్గేదే లే''. ఇందులో నవీన్ చంద్ర - దివ్య పిళ్లై - అనన్య సేన్ గుప్తా - రవి శంకర్ - రాజా రవీందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. 'దండుపాళ్యం' సినిమాను గుర్తు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

టీజర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఒక మర్డర్ మిస్టరీని చేధించే క్రమంలో చోటు చేసుకునే పరిణామాలను చూపించారు. పోలీసులు దీనికి నవీన్ చంద్ర కారణం అనే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో 'దండుపాళ్యం' గ్యాంగ్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ సినిమాలో రస్టిక్ యాక్షన్ తో పాటుగా లవ్ అండ్ రొమాన్స్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు.

డీకోడ్ చేయలేని ఆ రహస్యాన్ని ఎలా ఛేదించారు? అసలు హంతకుడు ఎవరు? దాని వెనుక మోటివ్ ఏంటి? అనేది తెలియాలంటే 'తగ్గేదే లే' సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో మర్కంద్ దేశ్ పాండే - పూజాగాంధీ - నాగబాబు - అయ్యప్ప శర్మ - పృథ్వీ - రవి కాలే - రచ్చ రవి - గెటప్ శీను - రామ్ ప్రసాద్ - రంగస్థలం మహేష్ - చిత్రం శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

భద్ర ప్రొడక్షన్‌ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే - పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజా రవీందర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. చిన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా ఉన్న ''తగ్గేదే లే''టీజర్‌ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.