బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తున్న సాంకేతిక యుగం ఇది. ఇలాంటి కాలంలో మీడియా నుంచి ఒక ప్రశ్న ఫిలిం హీరోలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ ఒక్క ప్రశ్న ఏమిటా అంటే... అది నిజంగా ఒరిజినల్ హెయిరేనా? లేక విగ్గునా? అనేది సూటి ప్రశ్న. ఒక్కోసారి ఆ విగ్గు సరిగా సెట్ కాకపోతే దానిని కనిపెట్టేసే నెటిజనులు నానా హైరానా చేయడం కూడా సోషల్ మీడియాల్లో చూస్తున్నాం. షష్ఠిపూర్తి వయసులోను పాతిక ప్రాయం హీరోలా కనిపించాలంటే దానికి తగ్గ మేకప్పు కవరింగ్ లు వగైరా అవసరం.
అయితే ఇలాంటి ఒక చిక్కు ప్రశ్నను నేచురల్ స్టార్ నాని ఎదుర్కొన్నాడు. అతడు `దసరా` బుల్లోడిగా జనం ముందుకు రాబోతున్నాడు. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టాలని ఒక రేంజులో కలలుగంటున్నాడు. దీనికోసం అతడు చాలా శ్రమించాడు. తన పాత్రకు తగ్గట్టు శరీరభాషను మార్చుకున్నాడు. పొడవాటి గిరజాల జుత్తును పెంచాడు. జిమ్ లో శ్రమించి కండలు కూడా పెంచాడు నాని. అదంతా దసరా పోస్టర్లు టీజర్ ట్రైలర్ లో బయటపడింది.
ఇకపోతే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ నానిని ``ఆ జుట్టు ఒరిజినలేనా?`` అని అడిగాడు. దీనిపై నాని స్పందిస్తూ.. `కచ్ఛితంగా ఒరిజినలే. దయచేసి ఇతరులను ఈ ప్రశ్న అడగవద్దు`` అని తనదైన శైలిలో ఛమత్కరించాడు. ఆ ఒక్క మాటతో ఇండస్ట్రీ హీరోలపై డౌట్లు పెట్టేశాడు నాని. ఒక రకంగా విగ్గులు ధరించే హీరోల గురించి హింటు కూడా ఇచ్చేసినట్టయింది. దసరా చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.