మదర్ ఆఫ్ డ్రాగన్.. వైప్ ఆఫ్ పాండా.. నాని తాలూకా!

Wed Nov 24 2021 11:37:22 GMT+0530 (IST)

Natural star Nani birthday special pic with Wife

నేచురల్ స్టార్ నాని- అంజనా యలవర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి అనతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ప్రేమకు గుర్తుగా గిఫ్ట్- అర్జున్. ప్రస్తుతం ఈ జంట అన్యోన్య దాంపత్యం... నానీకి అన్నిరకాలుగా భార్య అంజనా సహకారం తెలిసినదే. మంగళవారం అంజనా పుట్టిన రోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని తన భార్యకు వెరైటీగా విషెస్ తెలియజేసారు.``మదర్ ఆఫ్ డ్రాగన్.. వైప్ ఆఫ్ పాండా.. సెంటర్ ఆఫ్ అవర్ హోమ్ ..హ్యాపీ బర్త్ డే.. వి లవ్ యు... ``అంటూ నాని ఇన్ స్టాలో శుభాకాంక్షలు తెలిపారు. భార్యతో కలిసి దిగిన రెండు సెల్ఫీల్ని పోస్ట్ చేసారు. అంజనా వైజాగ్ లో రేడియో జాకీగా పనిచేసారు. విశాఖ సిటీతో అమె అనుబంధం ఎంతో ప్రత్యకమైనది.

నానితో పెళ్లి తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయ్యారు. నాని పెద్ద స్టార్ అయినా అంజనా సినిమా రంగం వైపు అడుగులు వేయలేదు. నాని వెనుకుండి ప్రణాళికాబద్ధంగా కథను నడిపించే సతీమణిగానే ఉన్నారు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న `శ్యామ్ సింగరాయ్` రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. దేవదాసి వ్యవస్థ .. మతపరమైన ఆచారాల చుట్టూ తిరిగే పీరియాడికల్ లవ్ స్టోరీ ఇది.

కోల్ కతా నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. కీర్తి సురేష్.. సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 24న రిలీజ్ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది నాని తొలిసారి అభిమాన సంఘాలతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక నాని తదుపరి చిత్రం `దసరా`. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.