Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
By: Tupaki Desk | 1 Feb 2023 8:00 AMనేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'దసరా'. కెరీర్ లో తొలిసారి ఊర మాసపీవ్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎస్.ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని సమ్మర్‌ఖ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ, ఓటీటీ రైట్స్ పరంగానూ రికార్డులు సృష్టిస్తోంది.
మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ నేపథ్యంలో సాగే ఈ మూవీ 90వ దశకం నేపత్యంలో సాగనుందని తెలుస్తోంది. ఈ మూవీతో హీరో నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియాని టార్గెట్ చేశాడు. టీజర్ లోని లాస్ట్ షాట్ టెర్రిఫిక్ గా వుంది. సినిమాపై నాని ఎంత కాన్ఫిడెంట్ గా వున్నాడో టీజర్ రిలీజ్ సందర్భంగా తను చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
గత కొంత కాలంగా పర్ ఫెక్ట్ మాసీవ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కోసం ఎదురు చూస్తున్న నానికి 'దసరా' పర్ ఫెక్ట్ మూవీ అని చెబుతున్నారు. తను కూడా ఇదే భావిస్తున్నాడట. ఇదిలా వుంటే పాండమిక్ తరువాత సినిమాల ఎంపిక విషయంలో వేగం తగ్గించిన నాని ఇప్పడు ఒక్కసారిగా వేగం పెంచబోతున్నాడు. 'దసరా'తో సమ్మర్ కు జాతర చేయబోతున్న నాని ఈ మూవీ తరువాత బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలని లైన్ లో పెడుతున్నాడు.
'దసరా' రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ నాని మరో కొత్త దర్శకుడు శౌర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని సీవీ మోహన్, విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ప్రారంభోత్సవం మంగళవారం లాంఛనంగా హైదరాబాద్ లో చిరు చేతుల మీదుగా జరిగింది. దీనితో పాటు మరో రెండు స్క్రిప్ట్ లని కూడా నాని తాజాగా లాక్ చేశారట. అంతే కాకుండా 'హిట్ 3'ని ఇదే ఏడాది చేయబోతున్న విషయం తెలిసిందే.
అంటే నాని ఇప్పటికి నాలుగు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టేశాడన్నమాట. వీటితో పాటు పరశురామ్ తోనూ ఓ మూవీకి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ఫైనల్ అయితే అఫీషియల్ గా అప్ డేట్ రావడం పక్కా. మరి కొన్ని కథలు కూడా చర్చల దశలో వున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. అంటే నాని 'దసరా' తరువాత నుంచి యమ స్పీడుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.