రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో తెలుగు వారంతా గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. భారతీయులంతా కూడా ఒక మొదటి పూర్తి స్థాయి ఇండియన్ సినిమా కి ఈ అవార్డు రావడంతో గర్వంగా ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ సాంగ్కు తమ దైన శైలిలో ట్రిబ్యూట్స్ ఇస్తున్నారు.
ఇప్పటికే పలు దేశాల అంబాసిడర్లు రోడ్డెక్కి మరి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తుంటే తెలుగు నిర్మాత ఒకరు వినూత్న మైన శైలిలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ట్రిబ్యూట్ ఇచ్చారు. తెలుగు సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి ఒక చెరగని అధ్యాయంగా నిలిచింది. దీనితో తమకు తోచిన విధంగా సినిమా యూనిట్కి టీమ్కి ట్రిబ్యూట్ ఇస్తున్నారు.
నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీలో పాపియోనా పార్క్ లో టెస్లా కార్ల లైట్ షో ను నిర్వహించారు. సుమారు 150 టెస్లా కార్లు ఈ అరుదైన నాటు నాటు ట్రిబ్యూట్ ఫీట్ లో పాల్గొన్నాయి. ఈ కార్లన్నిటిని RRR షేప్ లో పార్క్ చేసి "నాటు నాటు" పాటకు పాటలోని ట్యూన్స్ కి తగినట్లుగా లైట్ షో ను నిర్వహించారు. ఒక సినిమాకి ఇటువంటి లైట్ షోను నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని నిర్వహకులు చెబుతున్నారు. ఈ లైట్ షో చూడటానికి కేవలం టెస్లా ఓనర్స్ మాత్రమే కాకుండా దాదాపు 500 మంది ఔత్సాహికులు సైతం హాజరయ్యారు.
నార్త్ అమెరికన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు వంశీ కొప్పురావూరి ఉజ్వల్ కుమార్ కస్తల ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించారు. ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి ఆయన టీం అతి తక్కువ టైమ్లో కావలసిన అనుమతులు ఇచ్చి కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో జరగడం ఆసక్తికర అంశం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.