Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : గుంటనక్క గొర్రెల వల్ల మాస్టర్‌ బలి

By:  Tupaki Desk   |   15 Sep 2021 8:35 AM GMT
#BIGGBOSS5TELUGU : గుంటనక్క గొర్రెల వల్ల మాస్టర్‌ బలి
X
సోమవారం ఎపిసోడ్ లో జరిగిన ఎలిమినేషన్‌ నామినేషన్‌ రసాబాసగా మారిన విషయం తెల్సిందే. లోబో బరస్ట్‌ అవ్వడం.. ఉమాదేవి బూతులు మాట్లాడటం.. శ్వేత వర్మ చాలా సీరియస్ గా రియాక్ట్‌ అయ్యి హమీదా మరియు లోబోలపై విచక్షణ కోల్పోయి రంగు పూయడం వంటి సంఘటనలతో పాటు నటరాజ్ మాస్టర్ చేసిన గుంటనక్క మరియు ఏడుగురు గొర్రెల కథ వైరల్ అయ్యింది. ఆయన గురించి ఇప్పటి వరకు చాలా మంది పాజిటివ్‌ గా ఉండే వారు. కాని ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఆయనపై కొందరిలో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఆ సమయంలో ఆయన ఎవరిని అన్నాడు అనే విషయంలో క్లారిటీ లేదు. మొదటి నుండి తనతో సరిగా ఉండటం లేదు కనుక మాస్టర్ తన గురించే అని ఉంటాడు అనే ఉద్దేశ్యంతో యాంకర్ రవి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. రవితో మాట్లాడేందుకు మాస్టర్ అస్సలు ఆసక్తి చూపించలేదు. కనీసం రవి మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. రవి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా దోషిగానే చూస్తున్నాడు తప్ప వినేందుకు ఆసక్తి చూపించలేదు.

రవి మాటలతో మాస్టర్ కు మరింత కోపం వచ్చినట్లుగా అనిపించింది. అందుకే సన్నీ వెళ్లి ఎవరు ఆ గుంట నక్క అంటూ ప్రశ్నించిన సమయంలో వచ్చి మాట్లాడాడు కదా అంటూ రవిని చూపించాడు. గుమ్మడి కాయల దొంగ అంటే బుజాలు తడుముకున్నట్లుగా ఎందుకు రవినే వచ్చి మాట్లాడాడు అంటూ మాస్టర్ కొత్త లాజిక్ ను తీసే ప్రయత్నం చేశాడు. రవి వచ్చి మాట్లాడాడు కనుక ఇప్పుడు అతడే అంటూ మాస్టర్ మరింత క్లారిటీకి వచ్చినట్లుగా అనిపించింది. బిగ్ బాస్ లో యాంకర్ రవి అందరితో మంచిగా ఉండి అందరితో కలిసి ఆడాలనే ఉద్దేశ్యంతో ఏ చిన్న గొడవ వచ్చినా వెళ్లి మాట్లాడుకునేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా మాస్టర్ ను కూడా మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే మరింతగా పెద్ద ఇష్యూ చేస్తున్నారు. బుజాలు తడుముకుంటూ వచ్చాడు కనుక రవినే గుంట నక్క అనుకోవడం ఆయన అవివేకం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్‌ రవికి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. ఆయన అందరితో చిల్ గా ఉంటాడు తప్ప ఎవరిని తొక్కేయాలని కాని.. ఎవరిని ఇంకా ఏదో చేయాలని కాని చూడడు అని.. నటరాజ్ మాస్టర్ కాస్త ఓవర్‌ గా ఊహించుకుంటున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవిని గుంట నక్క అనడం.. ఆయన పక్కన ఉన్న వారిని గొర్రెలు అంటూ వ్యాఖ్యలు చేయడంతో మాస్టర్ పై ఉన్న గౌరవం జనాల్లో తగ్గుతుంది. ఇంటి సభ్యులు కూడా ఇప్పటికే ఆయన్ను లైట్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. నన్ను ఏం చేయలేదు గుంట నక్క అంటూ మాస్టర్ చేసిన వ్యాఖ్యలే ఆయనకు చేటు కలిగించేవిగా ఉన్నాయి అంటూ బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ కు ఎందుకు రవి టార్గెట్ చేశాడు అనిపించిందో అర్థం కావడం లేదు. మాస్టర్‌ అలా ఎందుకు అన్నాడు అనేది తర్వాత అయినా చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చెప్తాడు అనేది చూద్దాం.