కవర్ పేజీపై వీరమల్లు బ్యూటీ హాట్ ట్రీట్!

Thu May 12 2022 16:00:04 GMT+0530 (India Standard Time)

Nargis Fakhri on The Big Travel Issue Magazine

బాలీవుడ్ భామలు ఎందరున్నా.. కొందరి అందమే వేరు. సన్నజాజి తీగలా ఉంటూ.. తన అందచందాలతో కరెంటు షాక్ కొట్టేలా ఉండే భామల్లో నర్గీస్ ఫక్రీ ఒకరు. ఈ పల్చటి భామ అందాలు ఎంత చూసినా తనివి తీరవనే చెప్పాలి. మామూలుగానే  ఆమ్మడి సోగ కళ్లకు షాకులు తప్పవు. యువత హార్ట్ బీట్ ను  పెంచేస్తుంది. నర్గీస్  తాజా ట్రీట్  మరోసారి ఇన్ స్టాని హీటెక్కిస్తుంది.`ది బిగ్ ట్రావెల్ ఇష్యూ` మ్యాగజైన్ కి ఇచ్చిన కవర్ ఫోటో ఒకటిప్పుడు యువతలో దుమారం రేపుతుంది. వైట్ కలర్ బికినీలో టోన్డ్ బాడీ లుక్ లో అగ్గిరాజేస్తుంది. సముద్ర కెరటాల బ్యాక్ డ్రాప్ లో నర్గీస్ క్యామ్ కి ఫోజులిచ్చినట్లు తెలుస్తుంది.  ఇలాంటి టెంప్టింగ్ ఫోజులు నర్గీస్ కి కొత్తేం కాదు.

క్యాలెండర్ గాళ్ గా ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటి నుంచి గ్లామర్ ఎలివేషన్స్ లో అదే రకమైన టెంపోని కొనసాగిస్తూ యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. ఆన్ ది  స్ర్కీన్ అయినా  ఆఫ్ ది స్ర్కీన్ అయినా నర్గీస్ సెగల పొగలు ఏమాత్రం తగ్గవు.  

నర్గీస్ ఫక్రీ `మద్రాస్ కేఫ్`.. `మైనే తేరా హీరో` చిత్రాలతో పాటు.. సల్మాన్ కిక్ లో ప్రత్యేక గీతంతో అలరించిన ఈ భామ.. హాలీవుడ్ లో తొలిసారి స్పైలో నటించింది.  ప్రఖ్యాత క్రికెటర్ అజహర్ చిత్రంలో రియల్ లైఫ్ లో సంగీతా బిజలానీ పాత్రను.. రీల్ లైఫ్ పాత్రని పోషించింది. కానీ బాలీవుడ్ లో బిజీ నటిగా మాత్రం మారలేకపోయింది. కెరీర్ ప్రారంభించి దశాబ్ధం దాటినా ఇంకా నత్తనకనే సాగుతుంది. రెండేళ్లగా ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఈ నేపథ్యంలో అమ్మడికి తాజాగా పవన్ కళ్యాన్-క్రిష్ పిలిచి మరీ అవకాశం కల్పించారు. వీరిద్దరి కాంబినేషన్ లో  సోషియా ఫాటసీ చిత్రం `హరి హర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో  నర్గీస్ ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లీడ్ లో నిధి అగర్వాల్  నటిస్తుంది.

 మరి పవన్ కి జోడీగా తీసుకున్నారా? అర్జున్ రాంపాల్ కి ఫెయిర్ గానా? అన్నది తెలియాలి. నర్గీస్ కి ఇది తొలి తెలుగు సినిమా.  ప్రస్తుతాని అమ్మడి ఆశలు అన్నీ ఈసినిమాపైనే. ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా  పూర్తయింది.