బటన్ లెస్ ఫోజ్ తో హీటెక్కించిన నర్గీస్ ఫక్రీ

Thu May 19 2022 08:00:01 GMT+0530 (IST)

Nargis Fakhri Latest Photo

నర్గీస్ ఫక్రీ.. ఇండో వెస్ట్రన్ బ్యూటీ హంగామా బాలీవుడ్ లో ఇటీవల కనిపించడం లేదు.  అప్పట్లో యష్ చోప్రా కుమారుడైన ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ తర్వాత ఆ డేటింగ్ వ్యవహారం కనుమరుగైనట్టే ఈ అమ్మడు కూడా బాలీవుడ్ కి దూరమైపోయింది. అక్కడ అవకాశాలు ఏమంత పెద్దగా కలిసిలేదు. దాంతో ఈ బ్యూటీ ఎక్కువగా విదేశీ విహారయాత్రల వరకే పరిమితమైంది. ఇటీవల ఇన్ స్టాలో మాత్రమే ఫ్యాన్స్ కి టచ్ లో ఉంది.తాజాగా నర్గీస్ టాప్ లెస్ గా బోల్డ్ ఫోటోని షేర్ చేసి దానికి అంతే ఆసక్తికరమైన క్యాప్షన్ ని ఇచ్చింది. ``ప్రతిరోజూ మీ జీవితాన్ని మార్చడానికి మరొక అవకాశం. మీరు చిరు అలవాట్లను చదివారా? చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారితీస్తాయి. విజయం అనేది రోజువారీ అలవాట్ల ఉత్పత్తి`` అంటూ విజయం రహస్యాన్ని వర్ణించింది. కొంత గ్యాప్ తర్వాత వచ్చినా కానీ నర్గీస్ లో గ్లామర్ యాంగిల్ ఎక్కడా మిస్ కాలేదు. అలా బటన్ లెస్ లో ఇచ్చిన ఫోజ్ హీట్ పుట్టిస్తోంది.

ఇంతియాజ్ అలీ - రన్‌బీర్ కపూర్ ల `రాక్ స్టార్` మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఇండో అమెరికన్ బ్యూటీ మోడలింగ్ రంగంలో పాపులర్ అయ్యాక కింగ్ ఫిషర్ మోడల్‌గానూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. హాలీవుడ్ మూవీ  `స్పై` థ్రిల్లర్ తో పాటు హిందీ- ఇంగ్లీష్- తమిళ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం `టోరబాజ్` చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది. కరోనా సమయంలో రిలీజ్ కావాల్సిన చిత్రమిది. ఇదిలా వుంటే కరోనా కారణంగా ముంబై వదిలేసిన నర్గీస్ ఫక్రీ ఇటీవల న్యూయార్క్ సిటీలో వుంటోంది. ఇటీవలే జోషువా నేషనల్ ట్రీ పార్క్ లో సందడి చేసింది. ఇకపోతే తదుపరి ముంబైలో తన కమిట్ మెంట్లను పూర్తి చేసుకునేందుకు ఫక్రీ ప్లాన్ తో ఉంది. అలాగే హరి హర వీర మల్లులో నర్గీస్ నటిస్తోందని ప్రచారమైనా దానిపై కన్ఫర్మేషన్ లేదు.

డేటింగ్ ని ఒప్పుకున్న బ్యూటీ

నర్గీస్ ఫక్రీ చివరకు తాను ఉదయ్ చోప్రాతో 5 సంవత్సరాలు డేటింగ్ చేశానని `మౌంటెన్ టాప్స్` నుండి దాని గురించి అరవలేనని కూడా ఇటీవల వ్యంగ్యంగా మాట్లాడింది. ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టవద్దని కొందరు తనకు చెప్పారని నర్గీస్ ఫక్రీ అన్నారు. పబ్లిక్ లో తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ కానందుకు ఆమె పశ్చాత్తాపపడుతోంది. బ్రేకప్ అయిన చాలా కాలం తర్వాత నర్గీస్ ఫక్రీ చివరకు నటుడు-నిర్మాత ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసినట్లు అంగీకరించింది. తమ సంబంధాన్ని మీడియా మరియు వారి అభిమానుల కు తెలియకుండా దాచి పెట్టామని అంగీకరించింది.