నరేష్ - పవిత్ర లోకేష్ 'సెకండ్ ఇన్నింగ్స్' .... భలే ప్లాన్ వేశారుగా!

Tue Mar 21 2023 15:00:01 GMT+0530 (India Standard Time)

Naresh - Pavitri Lokesh 'second innings' .... well planned!

సీనియర్ నటుడు నరేష్ గత కొంత కాలంగా పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరూ కలిసి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఆ మధ్య వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ ఒక వీడియో వచ్చింది. కొన్ని గంటల పాటు ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టింది.పెళ్లి వీడియో సినిమా కోసం షూట్ చేసిందని.. ఇద్దరి యొక్క వివాహానికి ఇంకా సమయం ఉందని ఆ తర్వాత వెల్లడయింది. సెకండ్ ఇన్నింగ్స్ అనే సినిమా ను ప్రస్తుతం వీరిద్దరు ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. విడాకులు తీసుకున్న ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెడితే ఏర్పడే అవాంతరాలు.. ఆ తర్వాత వారు ఎదుర్కొన పరిణామల పై సెకండ్ ఇన్నింగ్స్ సినిమా రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు సెకండ్ ఇన్నింగ్స్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కథ కాస్త అటు ఇటుగా నరేష్.. పవిత్ర లోకేష్ యొక్క రియల్ లైఫ్ కథ ను పోలి ఉంటుంది. ఇద్దరు కూడా కొత్త జీవితం మొదలు పెట్టాలని భావిస్తున్న సమయంలో ఎదురవుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్  సినిమాలో వాటన్నింటిని చూపించాలని భావిస్తున్నారట.

పెద్ద వయసు వారు.. తోడు కోసం మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎదురయ్యే పరిణామాలు.. వారి పిల్లల నుండి సమాజం నుండి వచ్చే ప్రతికూలత ఇలా ప్రతి ఒక్క విషయాన్ని టచ్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా తో నరేష్.. పవిత్ర లోకేష్ లు తమ బంధాన్ని మరింత పెంచుకోవడంతో పాటు జనాలకు మరింతగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఎవరు అడ్డు వచ్చినా కూడా తాము కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావిస్తున్నాం.. కనుక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం అనే సందేశాన్ని ఈ సినిమాను ఇవ్వబోతున్నారట. ఈ సినిమా తో చాలా విషయాలను చెప్పాలని నరేష్.. పవిత్ర లోకేష్ లు సెకండ్ ఇన్నింగ్స్ తో భలే ప్లాన్ వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.