Begin typing your search above and press return to search.

నరేష్ పవిత్ర పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారుగా..!

By:  Tupaki Desk   |   30 May 2023 7:00 PM GMT
నరేష్ పవిత్ర పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారుగా..!
X
సీనియర్ యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు సీక్రెట్ గా ఉన్న వీరు ఎప్పుడైతే నరేష్ మూడో భార్య వీరిద్దరి గురించి మాట్లాడటం మొదలు పెట్టిందో ఎలాగు బయటకు తెలిసింది కాబట్టి వీరు కూడా ఓపెన్ అయిపోయారు. ముఖ్యంగా వీరి అసలు ఎందుకు దగ్గరయ్యారు అన్నది అందరికీ చెప్పేందుకు మళ్లీ పెళ్లి అంటూ ఒక సినిమా కూడా చేశాడు నరేష్. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఈ సినిమా వల్ల నరేష్ పవిత్ర గురించి దాచుకునే విషయాలు ఏమి లేదన్నట్టుగా చెప్పేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా నరేష్ పవిత్రల కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నరేష్ మరోసారి పవిత్ర తో తన రిలేషన్ గురించి చెప్పారు. అంతేకాదు పిల్లలు కనడం పై కూడా తమ అభిప్రాయం ఏంటో అన్నది కూడా చెప్పారు. ఇప్పటికీ పవిత్ర తో పిల్లలు కనడంలో తప్పేమి లేదని నరేష్ అన్నారు. తను పవిత్ర పర్ఫెక్ట్ గా ఉన్నామని.. ఇప్పటికీ మెడికల్ గా మేము పిల్లలు కనొచ్చు.

అయితే ఇప్పుడు పిల్లలని కంటే నాకు 80 ఏళ్లు వచ్చే సరికి పుట్టే బిడ్డకు 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా అనిపించింది. భార్యా భర్తలుగా మేము కలిసి ఉంటాం.. పవిత్ర పిల్లలు, నా పిల్లలు అందరు మా బిడ్డలే అనుకుంటాం మాకు ఇప్పుడు ఐదు మంది పిల్లలు ఉన్నారనుకొని బ్రతుకుతున్నామని అన్నారు.

తన దృష్టిలో బ్లడ్ రిలేషన్ షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది అంటున్న నరేష్ కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేది. ఆయన వెళ్లిపోయాక కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయా ఆ టైంలో పవిత్ర తనకు అండగా ఉంది. పవిత్ర లో మా అమ్మ విజయ నిర్మల కనిపించారు. అమ్మ విజయ నిర్మల కళ్లలానే పవిత్ర కళ్లు ఉంటాయని అన్నారు.

నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోవాలంటే మూడో భార్య రమ్య దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవాలి. ఆమె నుంచి డైవర్స్ రాగానే నరేష్ పవిత్రల రియల్ లైఫ్ మళ్లీ పెళ్లి జరుగనుంది.

ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన నరేష్ పవిత్ర విషయంలో తీసుకున్న నిర్ణయాలతో అందరికి షాక్ ఇచ్చారు. నరేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి మహేష్ కూడా ఓకే చెప్పారని అన్నారు. ఆయన తీసిన మళ్లీ పెళ్లి మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.