Begin typing your search above and press return to search.

పవిత్ర మీ ఆస్తికి పడిపోయిందా?

By:  Tupaki Desk   |   29 May 2023 10:11 AM GMT
పవిత్ర మీ ఆస్తికి పడిపోయిందా?
X
సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్ర లోకేష్ లివింగ్ రిలేషన్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అనే సంగతి అందరికి తెలిసిందే. తమ రిలేషన్ ని వీరు ఏకంగా మళ్ళీ పెళ్లి అనే సినిమా చేసి మరీ చూపించారు. వ్యక్తిగత జీవితంలో జరిగిన అన్నింటిని తెరపై ప్రేక్షకులకి చూపించి వినోదాన్ని అందించాలని అనుకున్నారు. అయితే మూవీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

ఇదిలా ఉంటే మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో నరేష్, పవిత్ర లోకేష్ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ శాటిలైట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో యాంకర్ డైరెక్ట్ గా నరేష్ ని ఉద్దేశించి పవిత్ర మీ ఆస్తిని చూసి వచ్చిందా, మిమ్మల్ని చూసా అనే ప్రశ్న వేసింది.

దీనికి నరేష్ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా సమాధానం చెప్పడం విశేషం. నాకు ఆస్తి లేనపుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఆస్తి చూసి ఇష్టపడి వచ్చినవాళ్ళు ఉన్నారు. నా పుస్తకంలో ఇవన్ని ఉన్నాయి. ప్రేమ, వ్యామోహమా అనేది తెలియని స్థితిలో నేను లేను. అయితే పవిత్ర అలా కాదు. ఆమెలో ఉన్న నిస్వార్ధమైన మనస్సు నాకు నచ్చింది.

అని చెప్పారు. తద్వారా పవిత్ర కేవలం తనని మనస్పూర్తిగా ప్రేమించి వచ్చిందని నరేష్ చెప్పకనే చెప్పారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం పవిత్ర లోకేష్ కేవలం అతని ఆస్తి చూసే వచ్చిందనే ప్రచారం నడుస్తోంది. గతం ఆమె మాజీ భర్త కూడా పవిత్ర లోకేష్ కేవలం డబ్బు ఉందనే నరేష్ కి దగ్గరైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా, ఎన్ని రకాలుగా ట్రోలింగ్ జరిగిన తమ బంధం విదిపోదని, అలాగే తాము వెతికి భయపడే పరిస్థితిలో లేమని ఈ ఇంటర్వ్యూలో నరేష్, పవిత్ర లోకేష్ చెప్పకనే చెప్పారు. మొత్తానికి మళ్ళీ పెళ్లి సినిమా ఫ్లాప్ అయిన, ఆ మూవీ కారణంగా ఈ జంట టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయారు.