నిత్య పెళ్లికొడుకు ఇమేజ్ ను ఆస్వాదిస్తున్న నరేష్?

Wed Mar 22 2023 09:59:09 GMT+0530 (India Standard Time)

Naresh Enjoys the image of Nitya bridegroom Remark

సీనియర్ యాక్టర్ నరేష్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా కెరియర్ ప్రారంభించిన నరేష్ తర్వాత  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.   విభిన్న పాత్రలతో నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.  ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నరేశ్ సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో లివింగ్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.  ఇక త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నట్లు వీరు ప్రకటించారు.అయితే ఇప్పటికే నరేష్ కి మూడు సార్లు వివాహమైంది.  పవిత్రా లోకేష్ ను చేసుకుంటే అది నరేష్ కి నాలుగో పెళ్లి అవుతుంది.  గత కొంత కాలంగా తన మూడవ భార్య రమ్య రఘుపతితో నరేష్ కు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

వీరి వివాహ బంధం ఎప్పుడో తెగిపోయింది. తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న నరేష్ గత కొన్నేళ్ల నుంచి పవిత్రా లోకేష్ తో డేటింగ్ లో ఉన్నారు.  పవిత్రా లోకేష్ కి  కూడా నరేష్ పెళ్లి చేసుకుంటే నాలుగో వివాహం అవుతుంది.

ఇదిలా ఉంటే జనవరి ఒకటవ తేదీన నరేశ్ పవిత్ర లోకేశ్ ముద్దు పెట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు.  దాని ద్వారా తాము లివింగ్ రిలేషన్లో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు.  ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్గా ఉంది.

తాజాగా నరేష్ అన్నీ మంచి శకునములే మూవీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో అటెండ్ కావడం ఆసక్తికరంగా మారింది.  దీనిపై మరో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కౌంటర్ వేశారు.  

నరేశ్ పెళ్లి కొడుకు తరహాలో కనిపిస్తున్నాడు అంటూ సరదాగా సెంటర్ వేశారు.  అయితే దీనిపై కి నరేష్ కూడా ఆసక్తికరంగా స్పందించడం విశేషం. ఎవరైనా పెళ్లి కొడుకు తరహాలో డ్రెస్సింగ్ వేసుకోవచ్చు. కానీ అందరూ నిత్య పెళ్లికొడుకు కాలేరు అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నారు. దీని ద్వారా నిత్య పెళ్లికొడుకు అనే బ్రాండ్ ని తాను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా నరేష్ తన మాటలతో స్పష్టం చేశారని టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.