జెర్సీ అర్జున్.. చేతిలో ధరణి ఆయుధాలు..!

Sat Apr 01 2023 10:21:06 GMT+0530 (India Standard Time)

Nani Shares Jersey Picture on Dasara Success

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన సినిమా దసరా గురించి అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల అయిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం... బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విపరీతమైన కలెక్షన్లు సాధిస్తూ.. దూసుకెళ్తోంది.కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా దుమ్ములేపుతోంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతూ... సంచలనం సృష్టిస్తోంది. అనేక రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా భారీ హిట్టు కావడంతో నాని ఓ ట్వీట్ చేశారు. తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ... ఓ ఫొటోను షేర్ చేశారు.

జెర్సీ సినిమాలో నాని క్రికెట్ టీమ్కి ఎంపికైన తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ప్రయాణిస్తున్న రైలు దగ్గర అరుస్తూ ఒక ఐకానిక్ సీన్ ఉంది. అయితే ఇప్పుడు కూడా తాను ఎంత ఆనందంగా ఉన్నాడో చెప్పడానికి ఆ సీన్ లోని ఫొటోను ట్విట్టర్ వేధికగా షేర్ చేశాడు. అయితే రెండు చేతుల్లో రెండు గొడ్డళ్లు ఉండగా... అరుస్తూ కనిపిస్తున్నాడు.

జెర్సీ అర్జున్ చేతిలో దసరా ధరణి ఆయుధాలు ఉండడం అందరిలోనూ ఎగ్జైట్ మెంట్ ను క్రియేట్ చేస్తోంది. నాని రెండు గొడ్డళ్లు పట్టుకొని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై నిల్చొని ఉన్నారు.

పైకి చూస్తూ గట్టిగా అరిచే ఈ ఫొటోను షేర్ చేసి.. తన మనసులో ఉన్న ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తే నాని ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో అర్థం అవుతోంది. ఫొటోతో పాటు లవ్ సింబల్ అలాగే దండం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీలను షేర్ చేశాడు.

ఈ పోస్టు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల చేస్తున్నారు. కంగ్రాట్స్ అంటూ కొందరు.. మంచి సినిమాను అందించారని మరికొంత మంది చెబుతున్నారు. అలాగే వంద కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా త్వరలోనే చేరుతుందంటూ చెప్పుకొస్తున్నారు. ధరణి క్యారెక్టర్ లో మీరు ఇరగదీశారంటూ మరికొంత మంది నెటిజెన్లు అంటున్నారు. ఏది ఏమైనా మార్చి 30న విడుదలైన ఈ చిత్రం పెద్ద ఎత్తున వసూళ్లను సాధిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.