నేచురల్ స్టార్ మాసీవ్ లుక్ టెర్రిఫిక్!

Sat Oct 01 2022 11:51:58 GMT+0530 (India Standard Time)

Nani Look From Dasara Movie

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మొస్ట్ అవైటెడ్ హైవోల్టేజ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ 'దసరా'. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎస్ ఎల్ వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.సింగరేణి కాలరీస్ నేపథ్యంలో అత్యంత మాసీవ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ధరణి అనే పక్కా తెలంగాణ యువకుడిగా ఊర మాసీవ్ అవతార్ లో హీరో నాని నటిస్తున్న సినిమా ఇది.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని వచ్చే ఏడాది 2023 మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ కి చాలా టైమ్ వున్నా చిత్ర బృందం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తోంది.

ఇందులో భాగంగా దసరా సందర్భంగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ని అక్టోబర్ 3 ఆదివారం విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయన్ సంగీతం అంస్తున్నారు. 'ధూమ్ ధామ్ దోస్తాన్..' అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియోతో ఈ మూవీ ప్రమోషన్స్ ని హోరెత్తించబోతున్నారు. ఈ పాటలో నేచురల్ నెవర్ బిఫోర్ మాసీవ్ అవతార్ లో కనిపించబోతున్నాడు. ఈ పాటలో బొగ్గు గనుల్లో తన స్నేహితులతో కలిసి నాని చేసే మాసీవ్ హంగామా కనిపించబోతోంది.

ఊర మాసీవ్ స్టెప్పులతో ముఖం నిండా బొగ్గు మసి పూసుకుని నాని కనిపిస్తున్న నాని మాసీవ్ అవతార్ కు సంబంధించిన స్టిల్ ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఆ మాసీవ్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. ప్రస్తుతం ఈ స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరలల్ గా ట్రెండింగ్ అవుతోంది. పక్కా గ్రామీణ యువకుడిగా మసి పట్టిపోయి మాసిన బట్టల్లో.. చెరిగిన జుట్టు.. మాసిన గడ్డం.. లుంగీ పైకి కట్టి.. చెదరని చిరునవ్వుతో నాని కనిపిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.  

భారీ అంచనాల మధ్య తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో మార్చి 30 2023 న విడుదల కానున్న ఈ మూవీలో సముద్రఖని సాయి కుమార్ జరీనా వాహెబ్ రోషన్ మాథ్యూ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ సత్యన్ సూర్యన్ సంగీతం సందోష్ నారాయణన్ ఎడిటింగ్ నవీన్ నూలిప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.