కుర్ర హీరో నోరు జారితే నానీదే బాధ్యత!

Mon Feb 24 2020 16:21:27 GMT+0530 (IST)

Nani Is Responsible for Vishwak Sen Speech In Hit Movie Pre Release Event

పరిశ్రమలో హీరోల యాటిట్యూడ్ గురించి నిరంతరం చర్చ సాగుతుంటుంది. ఏ హీరో వ్యవహారికం ఎలా ఉంటుంది? అన్నది మీడియా వర్గాల్లో చర్చకు తావిస్తుంటుంది. ఇక ఇటీవల ఫలక్ నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ స్పీడ్ గురించి తెలిసిందే. అతడి మాట తీరులో ఇస్పీడ్ ప్రతిసారీ వేడెక్కిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల్లో విశ్వక్ హద్దు మీరి ప్రవర్తించడం గతంలో చర్చకు వచ్చింది. దాసు ఫలక్ నుమా యాసతో లోకల్ బూతుల్ని యథాతథంగా వేదికలపైనే అనేయడం ఇర్రిటేట్ చేసింది. ఆ సినిమా రిలీజ్ సమయంలో రకరకాల వివాదాల్లోనూ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు రెండో ప్రయత్నంగా నానీ నిర్మిస్తున్న హిట్ (హెచ్.ఐ.టి) చిత్రంలో నటిస్తున్నాడు. కొత్తకుర్రాడు శైలేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో హిట్ రిలీజ్ కి రానున్న సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకలో విశ్వక్ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ``మా సినిమాకి వచ్చే ముందు ఎక్కువ నీరు తాగవద్దు. ఎందుకంటే మీకు యూరినల్స్ వెళ్ళడానికి కూడా సమయం ఉండకపోవచ్చు`` అంటూ పదే పదే వేదికపై చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యల్ని నెటిజనులు  ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు. ఇది అతి విశ్వాసం అని కొందరు ఆత్మ విశ్వాసం తో చేస్తున్న అతి అని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓసారి డీ తీరిపోద్ది అనే తరహా కామెంట్ కి ఇదే తీరుగా స్పందించారు నెటిజనులు.

అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మాత్రమే భావించాల్సి ఉంటుంది. అయితే కుర్రాడు కాబట్టి కాస్తంత అనాలోచితంగా ఆవేశపడుతున్నాడా? అయితే అనుభవజ్ఞుడైన నానీనే జాగ్రత్త పడాల్సి ఉంటుందేమో! ఇటీవలే దీపిక పదుకొనే అనాలోచితంగా చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకున్న సంగతిని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. నిర్మాత హోదాలో నానీకి కర్ తప్పదు. హిట్ ని కచ్ఛితంగా హిట్ చేయాలంటే జరంత భద్రం అన్న వ్యాఖ్యలు నెటిజనుల్లో వినిపిస్తున్నాయి మరి. ఇక ఈ థ్రిల్లర్ లో కొత్తదనం ఏమిటి? అన్నది చూడాలి.