#ఫ్రెండ్షిప్ డే.. నేచురల్ స్టార్ అరుదైన జ్ఞాపకాలు

Sun Aug 01 2021 22:00:01 GMT+0530 (IST)

Nani Friendship Day Post

నేచురల్ స్టార్ నాని స్నేహస్వభావం ఎంతో గొప్పది. అతడు ఎవరిని కలిసినా ఇట్టే ఆకట్టుకునే ప్రతిభావంతుడు. సాటి హీరోలు దర్శకులు అతడంటే అభిమానం కనబరుస్తారు. అందరినీ కలుపుకుంటూ అతడు మాట్లాడే తీరు కూడా గొప్పగా నచ్చేస్తుంది.ఇక వివిధ సందర్భాల్లో నానీ తన స్నేహాలు ఎలా కొనసాగాయో తాజాగా మెమరీస్ రూపంలో కొన్ని ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. వీటన్నిటిలో చరణ్ - తారక్ - ప్రభాస్ - రానా- నాని ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో హైలైట్ గా నిలిచింది.

తన చిన్న నాటి జిగిరీ దోస్తులు స్కూల్ ఫ్రెండ్స్ తోనూ.. తన భార్యామణి అలాగే నివేద థామస్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నది.. నాని బాలకుడిగా ఉన్నప్పటి ఫోటో ..అల్లరి నరేష్ ఫ్యామిలీ తో తన ఫ్యామిలీ కలిసి ఉన్నప్పటి ఫోటో ప్రతిదీ సంథింగ్ స్పెషల్ గా కనిపించాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. నానీకి ఇన్ స్టా మాధ్యమంగా ఇటీవల ఫాలోయింగ్ పెరిగింది. ఈ వేదికపై తన సినిమాల ప్రచారంతో పాటు వ్యక్తిగత విషయాలను అతడు షేర్ చేస్తున్నారు.

నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ. అతడు నటించిన `టక్ జగదీష్` రిలీజ్ కి రెడీగా ఉంది. తదుపరి శ్యామ్ సింఘరాయ్ రిలీజ్ కి రావాల్సి ఉంది.