యూఎస్ లో నాని దసరా రికార్డు రిలీజ్!

Sat Mar 18 2023 15:06:09 GMT+0530 (India Standard Time)

Nani Dasara record release in US!

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. సుకుమార్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రం తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నాని మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు టీజర్స్ ట్రైలర్స్ ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్లో తెలంగాణ యాసలో నాని పలికిన డైలాగులు ఓ రేంజ్లో పేలుతున్నాయి.  ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది.

మన తెలుగు సినిమాలకు యూఎస్ లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక నాని కెరియర్లో బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలవనుందని టాలీవుడ్ వర్గాల టాక్. అయితే  ఈ సినిమా యూఎస్ లో 600పైగా లోకేషన్స్లో వివిధ భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

ఇక దసరాలో నాని కీర్తి సురేష్తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని సాయి కుమార్ జరీనా వహాబ్ కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.