Begin typing your search above and press return to search.

దసరాతో నాని మెగా హీరోల ఇమేజ్ అందుకుంటాడా?

By:  Tupaki Desk   |   31 Jan 2023 2:00 PM GMT
దసరాతో నాని మెగా హీరోల ఇమేజ్ అందుకుంటాడా?
X
నేచురల్ స్టార్ నాని పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి కథ దొరికిన అందులో పాత్ర తీరు ఏ విధంగా ఉన్నా దానికి తగ్గట్లుగా తనని తాను మార్చేసుకొని క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేయడం నాని స్టైల్. ఇప్పటి వరకు నాని కెరియర్ లో వచ్చిన ప్రతి సినిమా అతన్ని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చింది. శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని తనని మరో లెవల్ లో రిప్రజెంట్ చేసుకున్నాడు. సినిమా ఫ్లాప్ అయినా కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే హీరోలలో నాని ముందు ఉంటాడు.

అయితే ఇప్పుడు నేచురల్ స్టార్ కూడా తన బ్రాండ్ ఇమేజ్ ని పాన్ ఇండియా లెవల్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నాని కెరియర్ లో మొదటి సారిగా పవర్ ఫుల్ మాస్ రోల్ లో తనని తాను చూపించుకోవడానికి దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకోవాలని భావిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఫుల్ మాస్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో నాని పోషించబోతూ ఉండటం విశేషం.

ఓ విధంగా చెప్పాలంటే తమిళ నేటివిటీకి దగ్గర తక్కువ కమ్యూనిటీకి చెందిన యువకుడి పాత్రలో అతను కనిపిస్తున్నాడు. మాసిన గెడ్డం, చెరిగిన జుట్టు మట్టిపట్టిన బట్టలతో నేచురాలిటీకి దగ్గరగా ఈ పాత్ర ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఇలాంటి పాత్రలోనే కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ని పుష్ప సినిమాలో ఇదే తరహాలో మాసివ్ లుక్ లో చేసి పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టాడు.

ఇప్పుడు అలాంటి లుక్ ని నాని కూడా దసరాలో ట్రై చేస్తూ ఉన్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే పీరియాడిక్ టచ్ ఈ మూవీ ఉన్నట్లు కనిపిస్తుంది. మరి మాసివ్ రియలిస్టిక్ రోల్స్ తో మెగా హీరోలు అందుకున్న పాన్ ఇండియా ఇమేజ్ ని దసరాతో నాని కూడా అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.