నాని దసరా డబుల్ కాదండోయ్... సింగిలే!

Fri Jan 27 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Nani Dasara film is rumored to have two parts

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్యాం సింఘారాయ్ హిట్ తర్వాత అంటే సుందరనికీ! తీశాడు. అది బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ప్రస్తుతం నాని దసరా సినిమాతో అలరించనున్నాడు. ప్రసుతం దసరా సినిమా షూటింగ్ను ముగించే పనిలో హీరో నాని బిజీగా ఉన్నాడు. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేస్తుండగా... ఈ షెడ్యూల్తో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తికానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో నాని రగ్గ్డ్ లుక్లో కనించనున్నారు.
 
ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.ఇక ఈ చిత్రంలో నాని ఫస్ట్ లుక్ చూసి అందరూ పుష్పలోని అల్లు అర్జున్ లుక్ తో పోల్చారు. దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి.  ఇక మార్చి 30 న రిలీజ్ అవ్వనున్న  ఈ సినిమా... మేకర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు.

దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా... ఈ సినిమాతోనే అతడు దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గోదావరిఖని సింగరేణి బ్యాక్డ్రాప్లో స్నేహం ప్రేమ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా రెండు పార్ట్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. దర్శకుడు శ్రీకాంత్... సినిమా క్లైమాక్స్ లో రెండో పార్ట్ హింట్ ఇస్తారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది తప్పుడు సమచారం అని తెలుస్తోంది. నాని దసరా ఒకే పార్ట్ ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
 
ఇక దసరా సినిమా కోసం తన లుక్ గెటప్ పూర్తిగా మార్చుకొని రఫ్ లుక్లో నాని కనిపిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా తెలంగాణ యాసను నేర్చుకున్నట్లు నాని గతంలో ప్రకటించాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఎమ్సీఏ తర్వాత నాని కీర్తిసురేష్ జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ ఏడాది మార్చి 30న దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.