ఇంతకీ దసరా హీరో ఎవరు బాసు..?

Fri Mar 31 2023 12:38:01 GMT+0530 (India Standard Time)

Confusion Whether The Hero Is Nani Or Dheekshith In Dasara

నాని దసరా చూసిన ఆడియన్స్ కి సినిమాలో హీరో నాని నా లేక దీక్షిత్ అన్నది కొంత కన్ ఫ్యూజ్ ఏర్పడుతుంది. అదేంటి అనుకోవచ్చు తెలుగు తెరకు కొత్తగా పరిచయమైన దీక్షిత్ దసరా సినిమాతో సూపర్ డెబ్యూ ఇచ్చాడు.సినిమాలో అతనికి మంచి పాత్ర పడింది. నాని ఫ్రెండ్ పాత్ర దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం అతనికి ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సూరి పాత్రలో దీక్షిత్ కూడా మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ నాని సైడ్ హీరో దీక్షిత్ మెయిన్ హీరో అన్నట్టుగా ఉంటుంది.

సెకండ్ హాఫ్ మాత్రం నాని ఓవర్ టేక్ చేశాడు. దసరా ఫస్ట్ హాఫ్ నానితో పాటుగా సూరి పాత్ర ఎంగేజ్ అవుతుంది. ఉన్నంతలో అతను కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే దీక్షిత్ పాత్రలో మరో తెలుగు నటుడిని పెట్టి ఉంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. దీక్షిత్ చేసిన సూరి పాత్రలో అతను ఉంటే బాగుంటుందని కొందరు కాదు ఇతను అయితే పర్ఫెక్ట్ అని కొందరు అంటున్నారు.

శ్రీకాంత్ ఓదెల కూడా ముందు దసరాలో సూరి పాత్ర కోసం మన యువ హీరోలనే సంప్రదించి ఉండొచ్చు. కానీ ఎవరు ఆసక్తి చూపించక పోవడంతో అతన్ని తీసుకుని ఉంటారు.

సినిమాలో హీరో అంటే హీరోయిన్ మనసును గెలవాలి అలాంటిది దసరాలో ఆ ఛాన్స్ హీరో ఫ్రెండ్ అయిన సూరికి ఉంటుంది. అలాంటి పాత్ర చేసిన దీక్షిత్ కు మంచి స్కోప్ దొరికింది. దసరా సినిమాలో నాని కీర్తి సురేష్ లకు ఈక్వల్ గా దీక్షిత్ మెప్పించాడు.