Begin typing your search above and press return to search.

గుబురు గ‌డ్డం జులప‌లా జుట్టుతో 'పుష్ప'ని కొట్టేలా?

By:  Tupaki Desk   |   16 Jan 2022 5:06 AM GMT
గుబురు గ‌డ్డం జులప‌లా జుట్టుతో పుష్పని కొట్టేలా?
X
ప్ర‌యోగాల‌కు వెర‌వ‌ని నైజం నానీది. నేచుర‌ల్ స్టార్ గా ప‌క్కింటి కుర్రాడిగా పాపుల‌రైనా కానీ ప్ర‌తిసారీ త‌న‌దైన శైలిలో కొత్త‌ద‌నం అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక అత‌డు నెగెటివ్ షేడ్ ఉండే పాత్ర‌ల్లోనూ స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంత‌కుముందు జెండా పైకపిరాజు.. వీ లాంటి చిత్రాల్లో ఇలాంటి సాహ‌సం చేశాడు. ఆ సినిమాలు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నానీ ప్ర‌శంస‌లందుకున్నాడు. న‌టుడిగా అత‌డికి వంద మార్కులేశారు. ఇప్పుడు మ‌రోసారి అలానే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించేందుకు ప్రిపేర‌వుతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే గుబురు గ‌డ్డం జులప‌లా జుట్టు పెంచుతున్నాడ‌ట‌. తాజా చిత్రంలో అత‌డు ద్విపాత్రాభిన‌యం చేస్తాడ‌ని నైజాం యాస‌లో మాట్లాడ‌తాడ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ టైటిల్ `ద‌సరా`. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. రెండు పాత్ర‌ల్లో ఒక‌టి పూర్తి ఊర‌మాసీగా ఉంటుంది. రగ్గడ్ లుక్ తో ఉన్న పాత్రలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఉంటుందని వినికిడి. జెండాపై కపిరాజు.. వి సినిమాల తర్వాత నాని నెగెటివ్ రోల్ మూడోసారి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఓమిక్రాన్ ప్ర‌భావం త‌గ్గితే రామగుండం గనుల్లో షూటింగ్ ప్రారంభిస్తార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం నానీ లుక్ ఛేంజ్ కోసం సీరియ‌స్ గా వ‌ర్క‌వుట్లు చేస్తున్నారు.

నాని నటించిన వీ ఫ్లాపైనా కానీ `శ్యామ్ సింఘా రాయ్` పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. క‌రోనా క‌ష్టంలోనూ మంచి టాక్ తెచ్చుకున్న చిత్ర‌మిది. స్టార్ల‌ నుండి ప్రేక్షకుల వరకు ప్రశంసలు అందుకున్న చిత్ర‌మిది. ఇక త‌దుప‌రి అత‌డు చేసే సినిమా ద‌స‌రాని తెలుగు-త‌మిళంని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న నాని స్కెచ్ ఒక‌టి ప‌రిశీలిస్తే.. గుబురు గ‌డ్డం జులప‌లా జుట్టుతో `పుష్ప`ని కొట్టేలా క‌నిపిస్తున్నాడు మ‌రి. కంటెంట్ కూడా ఆ రేంజును మించుతుందేమో చూడాలి.