యూఎస్ లో దసరా బీభత్సం.. నెంబర్ వన్ రికార్డ్

Fri Mar 31 2023 10:31:56 GMT+0530 (India Standard Time)

Nani Dasara Grand Premiere

ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. హిందీ సినిమాలను బీట్ చేస్తూ అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్న సినిమాల జాబితాలో ఎక్కువగా టాలీవుడ్ మూవీస్ ఉండడం విశేషం. అందుకే మన హీరోలు ఓవర్సీస్ మార్కెట్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ఉంటారు. ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడితే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా చేరువ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని అంచనా. ఇదిలా ఉంటే ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. నాని నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో చేస్తారనే మాట వినిపిస్తుంది.  

ఈ ఏడాది దక్షిణాది సినిమాల్లో అత్యధికంగా ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రంగా దసరా నిలబడింది. వాల్తేర్ వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల తర్వాత ఓవర్సీస్ లో హైయెస్ట్ ప్రీమియర్ సో వసూళ్ళని దసరా సొంతం చేసుకోవడం విశేషం. ఈ మూవీ ఏకంగా 637000 డాలర్లు యూఎస్ లో ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా వసూలు చేసింది. నాని కెరియర్ లో కూడా ఇదే హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్ కావడం విశేషం.

 ఈ సినిమాకి ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఎక్కువమందికి రీచ్ అయ్యింది అని చెప్పాలి. యూఎస్ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ టికెట్ ధర 15 డాలర్లు నుంచి ప్రారంభం అవుతుంది.

ప్రీమియర్ షో కలెక్షన్స్ ఓవర్సీస్ లో బాక్సాఫీస్ రికార్డును కూడా సూచిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో యూఎస్ ఓవర్సీస్ లో దసరా రికార్డు స్థాయి వసూళ్లు  రాబట్టడం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. నాని గత సినిమాల ప్రీమియర్ కలెక్షన్స్ ఓపెనింగ్ చూసుకుంటే దసరా 637000 డాలర్లు వచ్చాయి.

అంటే సుందరానికి 236395 డాలర్లు శ్యామ్ సింగరాయ్ 133782 డాలర్లు ఎంసీఏ సినిమా 303981 డాలర్లు జెర్సీ మూవీ 144687 డాలర్లు వసూలు వచ్చాయి. వీటిలో దసరా హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే ఎంసీఏ సినిమా రెండో ప్లేస్ లో ఉండడం విశేషం. ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా కూడా ఫస్ట్ డే దసరా సినిమాకి నాని కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ అన్నమాట.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.