నానికి ఇప్పుడే అసలు సినిమా మొదలైంది..!

Sat Apr 01 2023 14:04:19 GMT+0530 (India Standard Time)

Nani Career Starts Now

దసరా హిట్ తో నాని తన రేంజ్ ఇది అని చూపించాడు. 15 ఏళ్ల కెరీర్ లో ఇప్పటికీ టైర్ 2 హీరోగానే ఉన్న నాని దసరాతో తన సత్తా చూపించాడు. సినిమాకు అతను పడిన కష్టం.. రిలీజ్ టైం లో చేసిన ప్రమోషన్స్ నానికి వసూళ్ల రూపంలో వస్తున్నాయి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ని నమ్మి నాని ఇంత రిస్క్ చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. స్టార్ హీరో సినిమా రేంజ్ లో వస్తున్న దసరా వసూళ్లు చూసి అందరు షాక్ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ప్రస్తుతానికి నాని సూపర్ హ్యాపీగా ఉన్నా ఇక మీదట అసలు సినిమా మొదలవుతుందని చెప్పొచ్చు. నాని దసరాతో తన రేంజ్ పెంచుకున్నాడు. ఫస్ట్ డే 35 కోట్ల పైన గ్రాస్ అంటే అది పెద్ద అచీవ్ మెంట్.

అయితే నాని రాబోయే సినిమాలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఉంటాయా. నాని ఈ క్రేజ్ ని తన తర్వాత సినిమాలకు కొనసాగిస్తాడా అన్నది డౌట్. ఒక్క సినిమా హీరో ఫేట్ మార్చేస్తుంది. దసరా చూసిన తర్వాత నాని ని ఇన్నాళ్లు మనమే తక్కువ అంచనా వేశాం అనుకున్నారు.

అయితే దసరా తర్వాత సినిమాలు కూడా నాని దసరాని మించే రేంజ్ లో తీయాలి ఏమాత్రం తేడా కొట్టినా మళ్లీ దెబ్బ పడటం ఖాయం. అందుకే దసరా హిట్ నానికి హిట్టు కిక్ ఇచ్చినా నెక్స్ట్ సినిమాల మీద మరింత బాధ్యత పెరిగేలా చేసిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అతను రెగ్యులర్ గా చేస్తున్న సినిమాలు చేస్తే మాత్రం మళ్లీ కెరీర్ గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది.

దసరా తర్వాత అంతకు మించి అనిపించే సినిమాలు చేయాల్సి ఉంటుంది. సో దసరా నానికి హిట్ తెచ్చిపెట్టడమే కాకుండా నెక్స్ట్ సినిమాల విషయంలో ఒక అలర్ట్ చేసిందని చెప్పొచ్చు.

ఇక దసరా వసూళ్ల విషయానికి వస్తే పోటీగా ఏ సినిమా లేకపోవడం తో పాటుగా అంతటా పాజిటివ్ టాక్ రావడం వీకెండ్ దసరా వసూళ్ల మోత మోగించడం పక్కా అని తెలుస్తుంది. నాని కెరీర్ లో దసరా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకి కూడా మంచి పేరు వచ్చింది.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.