Begin typing your search above and press return to search.
నాని-రవితేజ మల్టీస్టారర్!
By: Tupaki Desk | 26 March 2023 9:00 PMనేచురల్ స్టార్ నాని-మాస్ రాజా రవితేజ ఎలాంటి బ్యాకప్ లేకుండా పరిశ్రకొచ్చి అగ్ర హీరోలుగా ఎదిగిన వారు. సినిమా కష్టాలు తెలిసిన నటులు. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లగా ప్రారంభమై అగ్ర హీరోగాలుగా ప్రమోట్ అయిన వారే. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పరిశ్రమలో ఎదిగిన నటులు. మరి అలాంటి ఇద్దరు నటులు ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ కాంబినేషన్ ని ఆ స్ర్కీన్ పై కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందా? సరిగ్గా అభిమానులకు అలాంటి సర్ ప్రైజ్ ఇవ్వడానికి నాని-రవితేజ రంగం సిద్దం చేస్తున్నట్లు సంకేతాలు పాస్ చేసారు.
నాని నటించిన `దసరా` మార్చి 30న- రవితేజ నటించిన `రావణసూర` ఎప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకొ స్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నాని ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రవితేజతో ఓస్పెషల్ చిట్ చాట్ లోనూ పాల్గొన్నారు. ఇద్దరు ఇంటరాక్ట్ అయిన ఆ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఇరువురి నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలెన్నో బయటకు వచ్చాయి.
సినిమా పరిశ్రమలో వారి ప్రవేశం జరిగిన నాటి నుంచి హీరోలగా ఎదిగిన విధానం వరకూ ప్రతీది ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. అలాగే ఇద్దరు నిర్మాణ రంగంలో రాణిస్తోన్న వైనం గురించి ఆసక్తికర చర్చ సాగింది. నాని వాల్ పోస్టర్ బ్యానర్ తో సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. నాని తన బ్యానర్ ద్వారా కొత్త వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుం టున్నట్లు.. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్నట్లు చెప్పుకొచ్చారు.
`హిట్ -3` లో తాను ఎందుకు హీరో అయ్యాడు? అన్న వివరాలు తెలిపారు. ఈ మాటల సందర్భంలోనే రవితేజ-నాని కాంబో ఎలా ఉంటుంది? అన్నది చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో తమ రెండు బ్యానర్లు ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇద్దరు నటిస్తే మల్టీస్టారర్ అయిపోతుందిగా అంటూ సరదాగా ముచ్చటిం చుకున్నారు. `ఓకే ఈ కాంబినేషన్ బయటకి ఎవరికి ఇవ్వట్లేదమ్మా` అని రవితేజ సరదాగా అన్నారు.
లాభమో నష్టమో తమకే చెందుతుందని రవితేజ నాని అగ్రిమెంట్ చేసుకున్నారు. రవితేజతో విక్రమ్ రాథోడ్ లాంటి ఇంటెన్స్ అండ్ ఎనర్జిటిక్ రోల్ చేయాలని నాని మనసులో మాటని బయట పెట్టారు. అలాగే రవితేజ నాని `జెర్సీ` తరహా సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. నాని `శ్యామ్ సింఘరా రాయ్` సినిమా తనకు బాగా నచ్చిన సినిమాగా చెప్పుకొచ్చారు.