అలా పిలిస్తే ఇష్టమే

Thu Apr 18 2019 23:00:01 GMT+0530 (IST)

Nani Accepts Natural Star Appellation

యంగ్ హీరో నాని మరి కొన్ని గంటల్లో 'జెర్సీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. స్వశక్తితో ఎదిగిన నాని ప్రస్తుతం ఒక స్టార్ గా నిలిచాడు. జెర్సీ చిత్రం ఏకంగా 50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో నాని స్టార్ హీరోల జాబితాలో జాయిన్ అయినట్లే అని అంతా ఒప్పుకుంటున్నారు. నాని మొన్నటి వరకు తన బిరుదు నేచురల్ స్టార్ కు మొహమాట పడే వాడు. కాని ప్రస్తుతం తాను ఆ బిరుదును స్వీకరిస్తున్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ... నాకు నవీన్ అని పెరు పెట్టారు అమ్మ నాని అని పిలిచింది. అదే నాని పేరు సినిమాల్లో ఖరారు అయ్యింది. అభిమానులు నేచురల్ స్టార్ అంటూ పిలిచారు. వారు అభిమానంతో పిలిచిన పిలుపు నాకు సంతోషంను కలిగిస్తుంది. మొదట ఇంత అవసరమా అనిపించింది. కాని వారు ప్రేమతో పిలుస్తుంటే మాత్రం కాదనలేక పోతున్నాను అన్నాడు. ఇక స్టార్ డమ్ పై తనదైన నిర్వచనం చెప్పాడు నాని.

ఏ హీరోకు అయినా కంటెంట్ ఉంటేనే స్టార్ డమ్ వస్తుంది. ఈమద్య కాలంలో దానికి వినిపిస్తున్న ఇతర అర్థాలను తాను నమ్మను అన్నాడు. హీరోలో కంటెంట్ ఉంటేనే అతడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు అన్నాడు. నాని గత చిత్రం 'దేవదాస్' ఫ్లాప్ అయినా కూడా ఎలాంటి దిగులు లేదట గత చిత్రాల ఫ్లాప్ లకు తానేం భయపడను సక్సెస్ కోసం కష్టపడతానంటూ నాని చెప్పుకొచ్చాడు.

క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన 'జెర్సీ' చిత్రంలో 10 ఏళ్ల కుర్రాడికి నాని తండ్రిగా నటించాడు. తండ్రిగా క్రికెటర్ గా నాని మొదటి సారి నటించాడు. కనుక ఈ చిత్రం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. మరి కొన్ని గంటల్లో జెర్సీ ఫలితం తేలిపోనుంది.