Begin typing your search above and press return to search.

ఏ హీరో చేయని పని చేసిన నాని

By:  Tupaki Desk   |   31 May 2023 11:00 PM GMT
ఏ హీరో చేయని పని చేసిన నాని
X
నేచురల్ యాక్టింగ్‌తో టాలీవుడ్‌ లో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నేచురల్ స్టార్ నాని. కెరీర్ ప్రారంభం నుంచి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంతో కనిపిస్తూ స్పీడు పెంచేశాడు. దీనికి తోడు ఇటీవల దసరా మూవీ తో భారీ హిట్ కొట్టాడు. దీంతో తన క్రేజ్‌ ను నేషనల్ రేంజ్‌ కు పెంచుకున్నాడు.

'దసరా'తో పాన్ ఇండియా విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాని.. కొద్ది రోజుల క్రితమే తన 30వ సినిమా ను కూడా ప్రకటించాడు. శౌర్యూవ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో ను కూడా విడుదల చేశారు. అందులో ఈ చిత్రం తండ్రి, కూతురు సెంటిమెంట్‌ తో వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక, ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.

నాని 30వ సినిమా కు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షెడ్యూళ్ల ను వెంట వెంటనే పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా మరింత స్పీడు గా చిత్రీకరణ చేస్తోన్నారు. దీంతో ఈ మూవీ అనుకున్న సమయం కంటే ముందుగానే షూటింగ్‌ను పూర్తి చేసుకోబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ఈ సినిమా అనుకున్న సమయం కంటే ఒక నెల ముందుగానే షూట్ పూర్తి చేసుకోవడం వల్ల.. నిర్మాతలు అంచనా వేసుకున్న బడ్జెట్ కంటే తక్కువ ఖర్చే అవుతుందని తెలిసింది. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌కు కూడా చాలా సమయం మిగిలబోతుందట. దీంతో నాని పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నాని టాక్.

సాధారణంగా ఈ మధ్య కాలంలో వచ్చే ఎలాంటి సినిమా అయినా అనుకున్న సమయం కంటే లేటుగానే వస్తున్నాయి. అందులోనూ స్టార్ హీరోలు అయితే మరింత ఆలస్యం చేస్తోన్నారు. అలాంటిది నాని ఇప్పుడు స్పీడుగా షూట్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక, ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌ గా చేస్తోంది. ఇందులో బేబీ కియారా ఖన్నా నాని కూతురి పాత్ర ను పోషిస్తోంది. ఈ సినిమా కు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.