Begin typing your search above and press return to search.

ఏదైనా బాలయ్య మాస్ అప్పీల్.. వేరే లెవెల్..!

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:51 AM GMT
ఏదైనా బాలయ్య మాస్ అప్పీల్.. వేరే లెవెల్..!
X
నందమూరి బాలకృష్ణ మాస్ అప్పీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిగతా హీరోలు ఎంత మాస్ సినిమాలు చేసినా బాలకృష్ణ సినిమా సంథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. దానికి కారణం బాలయ్యకి ఉన్న మాస్ ఇమేజే. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి తన డ్యాన్స్ గ్రేస్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో ఇప్పటికీ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఇక వెంకటేష్ అయితే ఆయన పండించే ఎమోషన్ మిగతా హీరోల ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. కింగ్ నాగార్జున తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలకు ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

ఇక బాలకృష్ణ తన మాస్ అవతారం తో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుంటారు. తన సినిమాల్లో ఇది బాలయ్య మాత్రమే చేయగలడు అన్న సీన్స్ కొన్ని ఉంటాయని తెలిసిందే. ఇక బాలకృష్ణ డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవల్ అంతే. బాలకృష్ణ మాస్ అప్పీల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా బాలకృష్ణ మాస్ సినిమాలు ఇష్టపడతారు. బాలకృష్ణ సినిమా టీజర్, ట్రైలర్స్ మాత్రమే కాదు పోస్టర్స్ కూడా సెన్సేషనల్ గా మారుతాయి.

బాలకృష్ణ ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ఒక పోస్టర్ వదిలినా చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. లేటెస్ట్ గా బాలకృష్ణ 108వ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ చూస్తే మరోసారి నందమూరి ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది. భగవంత్ కేసరి తో బాలయ్య తన మాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపించడానికి రెడీ అవుతున్నారు.

అనీల్ రావిపుడి లాంటి ఎంటర్టైనర్ నుంచి బాలయ్య లాంటి మాస్ హీరో కాంబో సినిమా ఎలాంటి అంచనాలతో రాబోతుందో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ టైటిల్ పోస్టర్ ఉంది. బాలయ్య మాస్ లుక్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా అదుర్స్ అనిపించేలా ఉంది.

భగవంత్ కేసరి మరోసారి బాలయ్య మాస్ స్ట్రోక్ ఫ్యాన్స్ ని పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి మరో రెండు రోజుల్లో అనగా జూన్ 10న ఒక టీజర్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

బాలకృష్ణ, అనీల్ రావిపుడి కాంబో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సూపర్ అనిపిస్తుండగా సినిమా కూడా ఈ రేంజ్ లో ఉంటే మాత్రం రికార్డులు బద్దలవడం ఖాయమని చెప్పొచ్చు.