Begin typing your search above and press return to search.

గుర్రంపై బాల‌య్య హ‌ల్ చ‌ల్ చూడాల్సిందే

By:  Tupaki Desk   |   15 Jan 2022 9:51 AM GMT
గుర్రంపై బాల‌య్య హ‌ల్ చ‌ల్ చూడాల్సిందే
X
చాలా రోజుల త‌రువాత నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ `అఖండ‌` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సక్సెస్ తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన బాల‌య్య ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తున్నారు. స‌క్సెస్ ని ఊహించ‌ని రీతిలో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఆహా కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికే` టాక్ షోలోనూ అదే జోష్ ని చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్న బాల‌కృష్ణ ఈ సంక్రాంతిని కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకుంటున్నారు.

ఇందు కోసం ప్ర‌కాశం జిల్లాలోని కారంచేడులో వున్న త‌న సోద‌రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇంటికి వెళ్లారు. అక్క‌డ బావ ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో క‌లిసి సంద‌డి చేశారు. గుర్రం పైకి ఎక్కి బాల‌య్య చేసిన హంగామా మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సంద‌డి చేస్తోంది. ప‌క్క‌నే ఆయ‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర కూడా నిలిచి బాల‌య్య జోష్‌కి మురిసిపోయారు.

బాల‌య్య గుర్రం మీద స్వారీ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వేళ ఆ జిల్లా న‌లుమూల నుంచి వ‌చ్చిన అభిమానులు జై బాల‌య్య జై బాల‌య్య అంటూ నినాదాల‌తో హోరెత్తించారు. వాయిద్యాల‌తో స్థానికులు పాట‌లు పాడుతుంటే బాల‌య్య గుర్రంపై డ్యాన్స్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. బాల‌య్య త‌రువాత ఆయ‌న వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్క్ష కూడా గుర్రంపై స్వారీ చేయ‌డంతో అక్క‌డున్న వారంతా ఆయ‌న‌ని చూసి కేరింత‌లు కొట్టారు.

`అఖండ‌` మూవీ, అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె ` టాక్ ఫో స‌క్సెస్ కావ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న బాల‌కృష్ణ ఈ సంక్రాంతిని త‌న సోద‌రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఇంట జ‌రుపుకోవాల‌ని కుటుంబ స‌మేతంగా ప్ర‌కాశం జిల్లా కారంచేడు కు చేరుకున్నారు. దీంతో బాల‌య్య వ‌చ్చిన విష‌యం ఊరంగా పాకిపోయింది. దీంతో బాల‌య్య అభిమానులు బారీ సంక్ష‌లో త‌రలి వ‌చ్చి సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య గుర్రంపై డ్యాన్స్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

https://twitter.com/UrsVamsiShekar/status/1482234660206039040?cxt=HHwWgMDStb-k-pEpAAAA