బాలయ్య 106 అంతా రెడీ !

Sun Sep 15 2019 16:50:03 GMT+0530 (IST)

కే.ఎస్.రవి కుమార్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాలయ్య నెక్స్ట్ బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబో సినిమాకు సంబంధించి అంతా రెడీ అయింది. బాలయ్య బోయపాటి సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్ర నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా లాంచ్ కానుంది.ఇప్పటికే బాలయ్య సినిమా కోసం కథను సిద్ధం చేసిన బోయపాటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యాడు. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ తీసి ఘోరమైన అపజయం అందుకున్న బోయపాటి ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడట. అందుకే కథ కోసమే ఎక్కువ టైం తీసుకున్నాడని తెలుస్తుంది. తమ కాంబో సినిమాలో ఎలాంటి అంశాలు ఆశిస్తారో అవన్నీ ఉండేలా చూసుకుంటున్నాడట.

బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. సింహ సూపర్ హిట్ అవ్వగా లెజెండ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఛాన్స్ ఉంది.