మహేష్ అత్తమ్మ మిస్ ఇండియా అలా మిస్సింగ్!

Sun May 09 2021 22:00:01 GMT+0530 (IST)

Namrata Shirodkar mother wants to be Miss India

ఎన్నెన్నో అనుకుంటాం. కానీ అన్నీ జరుగుతాయా? అవును నిజమే కదా. జీవితంలో అది సాధించాలి.. ఇది సాధించాలని అంటూ ఎంతో అనుకుంటాం. కానీ వాటిని కొందరు మాత్రమే సాధించగలరు..సాధించి చూపించగలరు. రాజీ లేని పోరాటంతో లక్ష్యం దిశగా శ్రమించి నెరవేర్చుకోగలరు..ఇంకొందరి జీవితాల్లో మాత్రం గోల్స్ అనేవి కలలుగా మిగిలిపోతుంటాయి. అలాగని వాళ్లు ఫైయిలైనట్లు కాదు. అందుకు ఎన్నో కారణాలుంటాయి. ఎన్నో రకాల ఇబ్బందుల కారణం అయ్యుండొచ్చు. అలాంటి ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో సూపర్ స్టార్ మహేష్ అత్తమ్మ సైతం గోల్ మిస్ అయ్యారట.మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తల్లిగారు మిస్ ఇండియా అవ్వాలనుకున్నారుట. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ కాలం కలిసిరాక-పరిస్థితులు సహకరించకపోవడంతో ఓ ఇంటికి ఇల్లాలిగా మారిపోవాల్సి వచ్చిందని నమ్రత తెలిపారు. అమ్మ మిస్ ఇండియా కావాలని ఎన్నో కలలు కన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అమ్మ కల కలాగానే మిగిలిపోయింది. అయితే ఆమె కలను తాను మాత్రం నెరవేర్చానని నమ్రత గర్వంగా చెప్పుకొచ్చింది.

అమ్మ తన కలని నెరవేర్చుకోవడంలో విఫలమవడంతో నన్ను మిస్ ఇండియా స్థానంలో చూడాలనుకున్నది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి మిస్ ఇండియా కిరీటిం దక్కించుకోగలిగాను. ఇదే నా తల్లిదండ్రులకు నేనిచ్చిన బహుమతి. పేరెంట్స్ కోసం నేను ఏదో సాధించానన్న తృప్తి నాకెప్పటికీ ఉంటుంది. జీవితంలో అనుకున్నది సాధించగల్గితే దాన్ని మించిన సంతోషాన్ని ఇంకేది ఇవ్వదు. జీవితాన్నెప్పుడు రెండు కోణాల్లో చూడగలిగితేనే లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది ఒత్తిడి లేకుండా సవ్యంగా ఉంటుంది. ఒకటి కోల్పోయినా మరో ఆప్షన్ ని వెంటనే వెతుక్కోగలగాలి. లేకుంటే లైఫ్ అంతా గందరగోళంగాను .. అస్తవ్యస్తంగాను ఉంటుందని తెలిపింది.