Begin typing your search above and press return to search.

నీకోసం చీర కట్టుకొని రావాలా.. నాగవంశీ మరో కౌంటర్ వైరల్

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:53 PM GMT
నీకోసం చీర కట్టుకొని రావాలా.. నాగవంశీ మరో కౌంటర్ వైరల్
X
అనిక సురేంద్రన్ హీరోయిన్ గా బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీగా వస్తున్న బుట్టబొమ్మ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో అర్జున్ దాస్, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ తెరకెక్కించగా.. సితార నాగవంశీ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ.. మధ్యలో వచ్చిన ఓ వ్యక్తి సృష్టించే అల్లకల్లోలం చుట్టూ తిరిగే ఈ సినిమా ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసిందీ చిత్ర బృందం.

అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి మరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శక, నిర్మాతలతో పాటు నటీనటులు హాజరు అయ్యారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు తెలిపింది.

ఈ క్రమంలోనే ఈ రిపోర్టర్... హీరోయిన్ ఇప్పుడు వేసుకొని వచ్చిన బట్టలకు, టైటిల్ కు మ్యాచ్ అవ్వట్లేదని అని అడగ్గా... దీంతో ప్రొడ్యూసర్ నాగవంశీ ఫైర్ అయ్యారు. ఇప్పుడేంటి నీకోసం చీర కట్టుకొని రావాలా ఈ అమ్మాయి అంటూ అడిగారు.

దీంతో ఆ రిపోర్టర్ తెల్ల మొహం వేశారు. అక్కడితో ఆగకుండా ప్రొడ్యూసర్ నాగవంశీ... ఏంటీ ఈ అమ్మాయి బుట్టబొమ్మలా లేదా నీకు అలా కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు. మరి మీరు ఈ టైటిల్ ను ఎలా అనుకున్నారని మరోసారి రిపోర్టర్ ప్రశ్నించగా.. అంతకు ముందు తీసిన సినిమాలో ఈ పేరుతో పాట హిట్టు కావడం వల్ల సెంటిమెంట్ గా ఈ టైటిల్ పెట్టుకున్నామని నాగవంశీ వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజెన్లు అంతా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అంత పొలైట్ గా, పద్దతిగా మాట్లాడుతున్న రిపోర్టర్ తో అలా మాట్లాడడం సరికాదని కొందరు కామెంట్లు చేస్తుండగా... మరికొందరేమో చాలా మంచి కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.

అలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే వాళ్లకు ఇలాంటి సమాధానాలే వస్తాయని కొందరు నెటిజెన్లు చెబుతున్నారు. మరి ఫిబ్రవరి నాలుగో తేదీన రిలీజ్ కాబోయే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.