నాగశౌర్య 'వరుడు కావలెను' కొత్త విడుదల తేదీ ఖరారు..!

Fri Oct 15 2021 19:50:49 GMT+0530 (IST)

Nagashourya varudu kaavalenu new release date finalized

హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా ''వరుడు కావలెను''. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో లక్ష్మీ సౌజన్య అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. నిజానికి ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పండగ రోజు పలు చిత్రాల విడుదలలు ఉండటంతో నాగశౌర్య చిత్రాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు.'వరుడు కావలెను' చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు. ఇందులో రీతూ వర్మ చేతులకు మెహందీ పెట్టుకుని ఉండగా.. శౌర్య ఆమె చెవి దగ్గర మొబైల్ పట్టుకొని నిలబడి ఉన్నారు. ఇది లవ్ ఫన్ మరియు ఎమోషన్స్ కలబోసిన అందమైన కుటుంబ కథా చిత్రమని.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ - థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసుల సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. ఇందులో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - ప్రవీణ్ - అనంత్ - కిరీటి దామరాజు - ‘రంగస్థలం’ మహేష్ - అర్జున్ కళ్యాణ్ - వైష్ణవి చైతన్య - సిద్దిక్ష తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.