నాగశౌర్య హర్డ్ వర్క్ చూస్తే మతిపోతుంది

Tue Dec 07 2021 20:01:07 GMT+0530 (India Standard Time)

Nagashourya hard work is worth watching

మన హీరోలు క్యారెక్టర్ నచ్చితే దాని కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి వెనుకాడటం లేదు. గతంలో రిస్క్లంటే వెనకంజ వేసిన మన హీరోలు ఇప్పుడు మాత్రం రిస్క్ అంటే సై అంటూ ముందుకొస్తున్నారు. సినిమా కోసం.. తమని ప్రేమించే ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం ఎంతటి హార్డ్ వర్క్ ని అయినా సంతోషంగా చేయడానికి సిద్ధపడుతున్నారు. యంగ్ హీరో నాగశౌర్య కూడా తానేమి ఇందుకు మినహాయింపు కాదని తన అభిమానుల కోసం ఎంతటి హార్డ్ వర్క్ చేయడానికైనా తాను సిద్ధంగా వుంటానని నిరూపిస్తున్నాడు.ఆయన నటించిన తాజా చిత్రం `లక్ష్య`. సంతోష్ జాగర్లపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రం ఓ ఆర్చర్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రంలోని పార్ధూ పాత్ర కోసం హీరో నాగశౌర్య కఠోరంగానే శ్రమించారని అర్థమవుతోంది. `రొమాంటిక్` ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పాటలు పెద్దగా లేవు. కంటెంట్ స్ట్రాంగ్ గా వుండటం వల్ల సినిమాలో పెద్దగా పాటలకు ప్రాముఖ్యత ఇవ్వలేదని ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరో నాగశౌర్య వెల్లడించారు కూడా.

అయితే `ఓ లక్ష్యం...` అంటూ టైటిల్ సాంగ్ని చిత్రీకరించారు. ఈ పాటకు కాల భైరవ సంగీతం అందించారు. సినిమాలో ఇదే బెస్ట్ సాంగ్. ఈ పాటని ఇటీవల దీపావళికి చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోని ఈ మంగళవారం విడుదల చేశారు. ఈ విజువల్స్లో సినిమా కోసం నాగశౌర్య ఎంత హార్డ్ వర్క్ చేశాడో.. ఎంత ఎఫర్ట్ పెట్టాడో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. వర్కవుట్లు చేస్తూ భారీ టైర్లని సింగిల్ హ్యాండ్తో ఎత్తి పడేయడం... అతని డెడికేషన్ని తెలియజేస్తూ పలువురిని ఆకట్టుకుంటోంది.  

అంతే కాకుండా ఈ పాటలోని లైన్స్ చాలా ఇన్స్పైరింగ్గా వున్నాయి. సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా విలు విద్యని నేర్చుకున్న తీరు తనని తాను మార్చుకుని సరికొత్త మేకోవర్లోకి మారిన తీరు అతనికి సినిమాపై వున్న ప్యాషన్ని.. హార్డ్ వర్క్ని తెలియజేస్తూనే సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. నాగశౌర్య భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ డిసెంబర్ 10న విడుదల కాబోతోంది. అతని హార్డ్ వర్క్కి తగ్గ రిజల్ట్ రావాలని అంతా కోరుకుంటున్నారు.