ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ కిడ్ ఎవరో గుర్తుపట్టగలరా...?

Tue May 26 2020 23:00:01 GMT+0530 (IST)

Can you remember who star kid looks in this photo…?

సినీ సెలబ్రిటీల ఆఫ్ స్క్రీన్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఆసక్తి ఉంటుంది. వారి డైలీ లైఫ్.. వారి ఫ్యామిలీ.. పిల్లలు.. ఇలా అన్ని విషయాలు తెలుసుకోవాలని ట్రై చేస్తుంటారు. వాటి కోసం ఇంటర్నెట్ ని ఆశ్రయిస్తూ.. తమకు ఆసక్తిని కలిగించే విషయాలను సెర్చ్ చేస్తుంటారు. ముఖ్యంగా వారి అభిమానులు తమ ఫేవరేట్ హీరో హీరోయిన్స్ సమాచారాన్ని కలెక్ట్ చేసి దాచుకుంటారు. కొంతమంది వారి అన్ సీన్ ఫోటోలను.. చిన్ననాటి ఫోటోలను తమ గ్యాలరీలలో సేవ్ చేసుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరో చిన్ననాటి ఫోటో అని ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటారు.. లేదా మొబైల్ వాల్ పేపర్స్ గా స్క్రీన్ సేవర్ గా సెట్ చేసుకుంటారు. అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా అన్ సీన్ పిక్స్ అని అభిమానులకు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అయితే ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఇప్పటి హీరో హీరోయిన్ల ఫోటోలు అయితే విరివిరిగా అందుబాటులోకి ఉంటాయి కానీ సీనియర్ హీరోల చిన్ననాటి ఫోటోలు మాత్రం చాలా తక్కువ కనిపిస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్న ఒక హీరో చిన్ననాటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరని ఆలోచిస్తున్నారా..? అతనెవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ గా ఉన్న అక్కినేని నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున మొదటి సినిమా 'విక్రమ్'. తర్వాత రోజుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ 'యువ సామ్రాట్' గా.. 'మన్మథుడు' గా మారిపోయాడు. అయితే నాగార్జున 'విక్రమ్' సినిమా కంటే ముందే సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చాడు. కాకపోతే హీరోగా కాదు. బాల నటుడిగా పరిచయమయ్యాడు. ఈ విషయం ఇప్పటి తరం వారికి తెలియకపోయినా అప్పటి వాళ్లకు మాత్రం బాగా తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'సుడిగుండాలు' సినిమాలో నాగ్ నటించాడు. ఈ సినిమాలో రెండు మూడు వేషాల్లో కనిపిస్తాడు బుల్లి నాగ్. చిన్నప్పుడు నటించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. పెద్దవాడయ్యాక హీరోగా 'విక్రమ్' సినిమాతో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బుల్లి నాగ్ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి. కాగా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కూడా తండ్రి వలె బాలనటుడిగా పరిచయమయ్యాడు. 'సిసింద్రీ' సినిమాలో అడుగులు వేయలేని వయసులో పాకుతూనే సినిమాలో నటించి అలరించాడు అఖిల్.