Begin typing your search above and press return to search.

బుల్లి తెర.. ఓటీటీ పై ఒకేసారి నాగార్జున సందడి

By:  Tupaki Desk   |   18 Jun 2021 7:30 AM GMT
బుల్లి తెర.. ఓటీటీ పై ఒకేసారి నాగార్జున సందడి
X
అక్కినేని నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ మరో వైపు బుల్లి తెరపై బిగ్ బాస్ షో ను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. ఈయన బుల్లి తెర తో పాటు ఓటీటీ ఎంట్రీకి కూడా సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఓటీటీ కి సంబంధించిన ఒక షో ను నాగార్జున అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఆ షో ఏంటీ అనే విషయమై ఒకటి రెండు వారాల్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. నాగార్జున గతంలో వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఓటీటీ షో కనుక ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

వైల్డ్‌ డాగ్‌ సినిమా తర్వాత నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అది మాత్రమే కాకుండా నాగార్జున నుండి చాలా రోజులుగా అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న బంగార్రాజు సినిమా కూడా రూపొందుతుంది. మరో వైపు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్ లో బిగ్‌ బాస్ మొదలు అవ్వబోతుందని అంటున్నారు. ఈ సమయంలో ఓటీటీ షో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 కు హోస్ట్ అంటూ ఇప్పటికే స్టార్‌ మా వర్గాల ద్వారా అనధికారిక సమాచారం అందుతోంది. ఎప్పుడు షో ప్రారంభం అయినా ఆయన అందుబాటులోనే ఉంటాడని అంటున్నారు. ఇక నాగార్జున హోస్టింగ్‌ చేయబోతున్న కొత్త ఓటీటీ షో కూడా బిగ్‌ బాస్ షో కు సమాంతరంగానే ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి నాగార్జున ఒకే సారి బుల్లి తెర మరియు ఓటీటీ స్క్రీన్‌ పై సందడి చేయబోతున్నాడు.