Begin typing your search above and press return to search.

చైతో బ్రేక‌ప్ త‌ర్వాత సామ్ ని క‌లిసిన నాగ్?

By:  Tupaki Desk   |   15 May 2022 1:30 PM GMT
చైతో బ్రేక‌ప్ త‌ర్వాత సామ్ ని క‌లిసిన నాగ్?
X
అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట విడాకుల ప్ర‌హ‌స‌నం గురించి తెలిసిందే. ఊహించ‌ని విధంగా ఈ జంట విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో అక్కినేని అభిమాన కుటుంబం స‌హా ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్న జంట ఇంత‌లోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మేంటా? అంటూ అంద‌రూ సందేహాలు వ్య‌క్తం చేసారు. ఆ ఇద్ద‌రూ విడిపోవ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయంటూ క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ ఇద్ద‌రూ అస‌లు రీజ‌న్ ఏమిట‌న్న‌ది ఇప్ప‌టికీ చెప్ప‌లేదు.

ఇక‌పోతే స‌మంత.. చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత సినిమాల ప‌రంగా బిజీ అయిపోయింది. చైత‌న్య కూడా త‌న కెరీర్ పైనే దృష్టి పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. వృత్తిలో బిజీ అవ్వ‌డం తో కొన్నిటిని మ‌ర్చిపోయి జీవించ‌గ‌లుగుతున్నార‌న్న టాక్ ఉంది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు అక్కినేని నాగార్జున తీసుకున్న ఒక నిర్ణ‌యం షాకింగ్ గా ఉందంటూ ముచ్చ‌ట సాగుతోంది.

ఇటీవ‌లే కింగ్ నాగార్జున నేరుగా వెళ్లి మాజీ కోడ‌లు స‌మంత నాన్న గారిని క‌లిసార‌ట‌. స‌మంత - చైత‌న్య భ‌విష్య‌త్ బావుండాల‌ని దానికోసం ఏదైనా చేయాల‌ని ఆయ‌న‌తో ముచ్చ‌టించార‌ని ఒక సెక్ష‌న్ మీడియాలో అన‌ధికారిక క‌థ‌నాలొస్తున్నాయి. నిజానికి స‌మంత అంటే నాగార్జున‌కు ఎంతో అభిమానం. సామ్ కి నాగార్జున అన్నా అంతే అభిమానం.

అక్కినేని కుటుంబంలో ఎంతో క‌లివిడిగా క‌లిసిపోయిన స‌మంత ఉన్న‌ట్టుండి చైత‌న్య‌తో గొడ‌వ‌ప‌డి విడిపోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేనిది. వీళ్ల విడాకుల టైంలో నాగార్జున కూడా ఆపేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యార‌న్న‌ కామెంట్స్ ఎక్కువుగా వినిపించాయి. ``వారి లైఫ్ వాళ్ల ఇష్టం. ఇలా జరిగి ఉండకూడదు. మనం ఏం చేద్దాం. సమంత విడిపోయినా కానీ ఎప్పటికి మా ఇంటి బిడ్డ నే`` అంటూ నాగ్ చెప్పుకొచ్చాడు. మా అమ్మాయి నిర్ణ‌యాన్ని గౌర‌విస్తామంటూ స‌మంత‌కు త‌ల్లిదండ్రులు బాస‌ట‌గా నిలిచారు. అయితే ఇప్పుడిలా కొత్త పుకార్ షికార్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. నిజంగానే నాగార్జున అలా క‌లిసారా? ఏదైనా ముచ్చ‌టించారా? అన్న‌దానికి అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు.