నాగ్.. అంత ఈజీగా తెగేలా లేదు!

Sat Apr 01 2023 11:15:31 GMT+0530 (India Standard Time)

Nagarjuna Issues With New Director

కింగ్ నాగార్జున కెరియర్ గత కొన్నేళ్ళ నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ లేదని చెప్పాలి. బంగార్రాజు సినిమా మాత్రమే ఈ మధ్యకాలంలో అతని నుంచి వచ్చిన హిట్ మూవీ. మిగిలిన అన్ని కూడా డిజాస్టర్ అయ్యాయి. గత ఏడాది ది ఘోస్ట్ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఒక రీమేక్ పై మనసు పడ్డారు.మలయాళీ హిట్ మూవీ పెరింజు మరియమ్ జోస్ ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. దర్శకుడిగా టాలెంటెడ్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడని పరిచయం చేయబోతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు.

ఇక ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చిన మరుసటి రోజే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆ మూవీ రీమేక్ రైట్స్ తమ దగ్గర ఉన్నాయని దానిని తెలుగులో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు.

దీంతో ఇప్పుడు నాగ్ కి కొత్త చిక్కు వచ్చి పడింది. నిజానికి అభిషేక్ అగర్వాల్ నాగార్జునతోనే ఆ రీమేక్ చేద్దామని అనుకున్నా కూడా తాము అనుకున్న నిర్మాతతో కాకుండా ప్రసన్న కుమార్ వైపు వెళ్ళడం జరిగింది. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. అయితే నాగార్జున మాత్రం ఆ సినిమా రీమేక్ ని శ్రీనివాస్ చిట్టూరి ప్రొడక్షన్ లో చేయడానికి చేయడానికి డిసైడ్ అయిపోయాడు.

ఇక ప్రసన్న కుమార్ కూడా అమలాపురం బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయాలని డిసైడ్ అయ్యి లోకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు. ఇక రాజ్ తరుణ్ అల్లరి నరేష్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఈ రీమేక్ రైట్స్ విషయంలో అభిషేక్ అగర్వాల్ తో నాగార్జున సంప్రదింపులు జరుపుతున్న వారి మధ్య ఇష్యూ మాత్రం కొలిక్కి రాలేదని తెలుస్తుంది. ఆ నిర్మాత మాత్రం వెనక్కి తగ్గడం లేదని టాక్. ఈ నేపధ్యంలో ఈ రీమేక్ విషయంలో కొత్త దర్శకుడిని తీసుకొని నాగ్ ఇబ్బందులు పడుతున్నాడు అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.