నాగ్ ఇంకా రొమాంటికే.. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

Sat Oct 01 2022 10:52:30 GMT+0530 (India Standard Time)

Nagarjuna About Romance in The Ghost Film

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో రొమాంటిక్ హీరో ఎవరు అంటే 1980 మరియు 1990 కిడ్స్ చెప్పే పేరు నాగార్జున. అందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ మరోసారి నాగార్జున నిరూపించారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా అప్పట్లో నిలిచిన నాగార్జున ఇప్పటికి కూడా రొమాంటిక్ హీరోగానే చాలా మందికి నచ్చుతున్నాడు.ఆరు పదుల వయసులో కూడా నాగార్జున ను రొమాంటిక్ హీరోగా అభిమానులు చూడాలి అనుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. హీరోగా నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్ విడుదల కాబోతుంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున చేసిన వ్యాఖ్యలు నాగార్జునలోని రొమాంటిక్ యాంగిల్ కు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దసరాకు విడుదల కాబోతున్న ది ఘోస్ట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో నాగార్జునను ఆన్ స్క్రీన్ పై గన్స్ తో ఫైరింగ్ సన్నివేశాలు ఇష్టమా? లేదా అమ్మాయిలతో రొమాంటిక్ సన్నివేశాలు ఇష్టమా? అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు నాగార్జున మాంచి రొమాంటిక్ సమాధానం ఇచ్చాడు. ఒక చేతిలో గన్ పట్టుకుని మరో చేతిలో అందమైన అమ్మాయిని పట్టుకుని కనిపించడం నాకు ఇష్టం అన్నాడు.

ది ఘోస్ట్ లో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నట్లుగా పోస్టర్స్ ను చూస్తుంటే అనిపిస్తుంది. గన్స్.. అమ్మాయిలను సమానంగా ఇష్టపడుతాను అంటూ నాగ్ తన రొమాంటిక్ యాంగిల్ ను చూపించాడు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.