ఇంత వరకు కనిపించని పాత్రలో నాగచైతన్య

Sat Jan 29 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Nagachaitanya in a role that has not been seen for so long

సమంతతో కలిసి నటించిన `మజిలి` చిత్రంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు యంగ్ హీరో నాగచైతన్య. `వెంకీ మామ` తరువాత కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం `లవ్ స్టోరీ` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించి చై ఖాతాలో మరో హిట్ గా నిలిచింది.ఈ మూవీ తరువాత నాగచైతన్య - కింగ్ నాగార్జునతో కలిసి చేసిన చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని అందించింది. రమ్యకృష్ణ కృతిశెట్టి హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీని `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు చై.

ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ లని తన ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న నాగచైతన్య ఈ ఏడాది కొత్త అడుగులు వేస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ తో కలిసి `లాల్ సింగ్ చద్దా`లో నటిస్తూ ఇదే ఏడాది బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈమూవీపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

ఈ మూవీతో పాటు నాగచైతన్య `మనం` ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో `థాంక్యూ` పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. దిల్ రాజ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రష్యా రాజధాని మాస్కోలో జరుగుతోంది. ఇదిలా వుంటే ఇదే ఏడాది నాగచైతన్య వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ నిర్మించనున్న ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సిరీస్ ని మొంత్తం మూడు సీజన్ లుగా తెరపైకి తీసుకురాబోతున్నారు. అందులో ఒక్కో సిరీస్ లో ఎనిమిది ఎపిసోడ్ లు వుండబోతున్నాయి. యూనివర్సల్ కథాంశంతో టైమ్ ట్రావెల్ కథగా థ్రిల్లింగ్ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ లో నాగచైతన్య జర్నలిస్టుగా డిఫరెంట్ మేకోవర్ తో నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నారని. ఇందు కోసం చై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది.

ఈ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీగా బడ్జెట్ ని కేటాయిస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇందులో నాగచైతన్యకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించబోతోంది. `థాంక్యూ` పూర్తయిన తరువాత ఈ వెబ్ సిరీస్ ప్రారంభించబోతున్నారు.