చై ఆ తరహా ప్రాజెక్ట్ లకు న్యాయం చేయలేడా?

Thu Sep 16 2021 14:03:25 GMT+0530 (IST)

Naga chaithanya justice be done to those projects

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `లవ్ స్టోరీ`లో సాయి పల్లవితో కలిసి చై నటించాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేస్తున్న ప్రాజెక్ట్ లతో పాటు డిజిటల్ ఎంట్రీకి సంబంధించిన సీక్రెట్స్ ని కూడా రివీల్ చేశాడు.నాగచైతన్య ప్రస్తుతం `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తున్న `థ్యాంక్యూ`లో నటిస్తున్నాడు. ఇదే ఏడాది బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ నటిస్తూ నిర్మిస్తున్న `లాల్ సింగ్ చద్దా`లో ఓ కీలక అతిథి పాత్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించనున్న వెబ్ థ్రిల్లర్ తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు చై.

ఇదే విషయం గురించి చై మాట్లాడుతూ OTTల్లో కొత్తగా ప్రయత్నించడానికి తనకు ఎలాంటి అడ్డంకులు లేవని చైతన్య వెల్లడించాడు. తను రాబోయే రోజుల్లో సినిమాలతో పాటు OTT ప్రాజెక్ట్ లని కూడా చేయాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ధృవీకరించాడు.

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ లో చైతన్య అరంగేట్రం చేయనున్న విషయం తెలిసిందే. `నేను లాల్ సింగ్ చద్దా`లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది` అని చై చెప్పాడు. తన ప్రస్తుత దృష్టి తెలుగు మరియు తమిళ సినిమాలపై ఉందని స్పష్టం చేశాడు.

పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైన అనుభవం గురించి మాట్లాడుతూ `పాన్-ఇండియా ప్రాజెక్టుల పేరుతో ప్రాంత-నిర్దిష్ట సాంస్కృతిక సున్నితత్వాలకు తాను న్యాయం చేయగలనా అని తనని తానే తనను తాను ప్రశ్నించుకుంటానని చెప్పాడు.