శౌర్య బాబు భలే టైటిల్ పట్టాడే..!

Tue Nov 29 2022 10:10:00 GMT+0530 (India Standard Time)

Naga Shaurya Next Project Interesting Title

యంగ్ హీరో నాగ శౌర్య సక్సెస్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగా ఈయన ఆ మధ్య కృష్ణ వ్రింద విహారి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్స్ విషయంలో నాగ శౌర్య కాస్త ఎక్కువగానే వర్కౌట్స్ చేస్తాడు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఆయన సినిమాల టైటిల్స్ కాస్త విభిన్నంగా క్యాచీగా ఉంటాయి అనే టాక్ ఉంది.ఇప్పుడు అదే టాక్ కంటిన్యూ అయ్యేలా నాగ శౌర్య కొత్త టైటిల్ ఉంది. విభిన్నంగా ఉండటంతో పాటు క్యాచీగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం శౌర్య బాబు చేస్తున్న సినిమా యొక్క టైటిల్ ను రంగబలి అంటూ ఖరారు చేసేందుకు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రంగబలి టైటిల్ రెండు సూపర్ హిట్ సినిమాల యొక్క టైటిల్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెట్టినట్లుగా ఉంది అంటూ కూడా టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి నాగ శౌర్య సినిమా ఫలితం ఏమో కానీ రంగబలి టైటిల్ తో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం అన్నట్లుగా టైటిల్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.

నాగ శౌర్య ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ కష్టపడుతున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేసి ఒక సెట్టింగ్ ను వేయడం జరిగిందట. ఆ సెట్టింగ్ లోనే మెజార్టీ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఆ మధ్య నాగ శౌర్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగానే అస్వస్థతకు గురి అయ్యాడు. మళ్లీ ఇప్పుడు షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.