ఎన్నాళ్లకెన్నాళ్లకు సగం గడ్డంతో ట్రిమ్ గా కుర్రహీరో లుక్

Tue Sep 29 2020 23:10:45 GMT+0530 (IST)

Young hero look as a trim with beard for years

ఇటీవలి కాలంలో యువహీరోల కమిట్ మెంట్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు అలుపెరగక శ్రమిస్తున్న తీరు ఆ ఇన్వాల్వ్ మెంట్ ముచ్చటగొలుపుతోందనే చెప్పాలి. క్యారెక్టర్ కోసం కటౌట్ పెంచాలన్నా.. గడ్డం మీసాలు పెంచాలన్నా అందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఎంత రిస్కయినా శ్రమిస్తున్నారు. అలవాటుపడుతున్నారు.ఇటీవల ఆరేడు నెలలుగా నాగశౌర్య నిండుగా పెరిగిన గడ్డంతో కనిపించి షాకిచ్చాడు. భీకరంగా దేహాకృతిని మార్చాడు. కండలు మెలితిప్పి 8 ప్యాక్ లతో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతడి లుక్ కూడా వైరల్ అయ్యింది. అయితే ఉన్నట్టుండి శౌర్య ట్రిమ్ చేసిన గడ్డంతో కనిపించి షాకిచ్చాడు. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా కోసమే ఇదంతా. కెరీర్ 20 వ చిత్రం కోసం నాగ శౌర్య చాలా సాహసాలే చేయనున్నాడు. పూర్తిగా భిన్నమైన రూపంతో కనిపించనున్నాడు. ఈ చిత్రం కోసం జుట్టు గడ్డం పెంచుకున్నాడు. ఎట్టకేలకు ఇంతకాలానికి రూపం మార్చాడు. గడ్డం తగ్గించి కనిపించాడు. తాజా చిత్రంలో నాగ శౌర్య రెండు విభిన్న రూపాల్లో కనిపించనున్నాడు. అతను గడ్డం లుక్ కి సంబంధించిన షూట్ ను పూర్తి చేశాడు. వేరొక గెటప్ తోనూ చిత్రీకరణ చేయాల్సి ఉందిట.