Begin typing your search above and press return to search.

నాగచైతన్య కొత్త ఇల్లు.. మొదటి అతిధి అతనే!

By:  Tupaki Desk   |   22 March 2023 10:52 PM
నాగచైతన్య కొత్త ఇల్లు.. మొదటి అతిధి అతనే!
X
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని టాలీవుడ్‌లో సొంతం చేసుకున్నాడు. క్లాస్ సినిమాతో ఎక్కువగా నాగచైతన్య కెరీర్‌లో హిట్స్ కొట్టాడు. అతని కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలన్నీ కూడా క్లాసిక్ జోనర్ లోనే రావడం విశేషం. చందూ మొండేటి తో చేసిన ప్రేమమ్ మూవీ నాగ చైతన్య కెరీర్ లో సోలో బిగ్ హిట్ . మాస్ కమర్షియల్ జోనర్‌లో సినిమాలు చేసినా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే మరోసారి కస్టడీ సినిమాతో కమర్షియల్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని నాగచైతన్య భావిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా రీచ్ అయింది. వెంకట్ ప్రభు లాంటి టాలెంటెడ్ దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, స్టార్ హిరోయిన్ సమంత నుంచి విడాకులు తీసుకున్నారు. కరోనా సమయంలోనే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.

ఇక వీరి బంధం వీగిపోయిన తర్వాత సమంతకి దూరంగా నాగ చైతన్య వచ్చేశాడు. అయితే అప్పటి నుంచి ఎక్కువగా హోటల్స్ లోనే ఉంటున్నాడు. సమంతతో విడిపోయిన తర్వాత కొద్ది రోజులు మానసికంగా ఇబ్బందులు పడిన కూడా మరల సినిమాలలో బిజీ కావడంతో ఆ ఆలోచనల నుంచి బయటకి వచ్చాడు. అయితే నాగ చైతన్యకి పెళ్లి తర్వాత కూడా సొంత ఇళ్ళు లేదు గతం లో బాచిలర్ గా ఉన్నప్పుడు ఎదో ఒక బాచిలర్ ఫ్లాట్ ఉండేది పెళ్లి తరువాత సమంత తో కలిసి మరొక ఫ్లాట్ కొనుగోలు చేసుకున్న దానిని సమంతకి వదిలేసి వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో తండ్రి నాగార్జున ఇంటి పక్కన ఖాళీ స్థలం కొనుగోలు చేసుకొని సొంత ఇళ్ళుని నాగ చైతన్య కట్టుకున్నాడు . అన్ని దగ్గరుండి చూసుకుంటూ తనకి నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాడు. గత వారమే ఆ ఇంటిలోకి షిఫ్ట్ అయ్యాడు . తాజాగా దర్శకుడు చందూ మొండేటి నాగ చైతన్యతో కలిసి దిగిన ఫోటోని పేస్ బుక్ లో షేర్ చేశాడు. ఉగాది రోజున యువసామ్రాట్ కొత్త ఇళ్ళు. నేనే మొదటి అతిథి. కంగ్రాట్యూలేషన్ అండ్ థాంక్యూ నాగ చైతన్య అంటూ చందూ మొండేటి పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.