Begin typing your search above and press return to search.
అల్లు కాంపౌండ్ లో అక్కినేని హీరో!
By: Tupaki Desk | 29 May 2023 10:29 AMఅక్కినేని యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. వెంకట్ ప్రభు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన కూడా నాగ చైతన్యకి సక్సెస్ ఇవ్వలేకపోయారు. కస్టడీతో హ్యాట్రిక్ ఫ్లాప్ లని చైతూ తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని చెప్పారు. అయితే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు. అలాగే ప్రస్తుతం కొత్త కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో గీతా ఆర్ట్స్ 2లో నాగ చైతన్య ఒక సినిమా కమిట్ అయ్యారు. అయితే ఎందుకనో అది పట్టాలు ఎక్కలేదు. తాజాగా ఈ మూవీపై బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.
2018 చిత్రాన్ని రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న బన్నీవాస్ మూవీ సక్సెస్ మీట్ లో చైతూతో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి క్లారిటీగా ఆన్సర్ ఇచ్చారు. చైతన్యతో ప్రాజెక్ట్ అనుకున్నారు కదా అది ఇప్పుడు ఉందా అని అడిగారు. చైతన్యతో గీతా ఆర్ట్స్ 2లో మూవీ ఉంటుందని బన్నీ వాస్ ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు.
సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుందని, పూర్తి వివారాలు మరికొన్ని రోజుల్లో రివీల్ చేస్తామని చెప్పారు. దానికి సంబందించిన వర్క్ ప్రస్తుతం జరుగుతోందని స్పష్టం చేశారు. మరి ఈ చిత్రం కోసం బన్నీ వాస్ దర్శకుడిగా ఎవరిని ఖరారు చేసారనేది తెలియాల్సి ఉంది. కస్టడీ తర్వాత చైతన్యకి ఇప్పుడు సాలిడ్ హిట్ పడాలి.
యంగ్ హీరోలు అందరూ కూడా డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి కంటెంట్ ని నమ్ముకొని మూవీ చేస్తే చైతన్యకి మంచి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.