గోవాకు రెడ్డి గారి అల్లుడు

Wed Aug 08 2018 15:52:27 GMT+0530 (IST)

Naga Chaitanya and Anu Emmanuel Heading to Goa for Sailaja Reddy alludu Song Shoot

ఇక్కడ రెడ్డిగారు అంటే ఎవరో అనుకునేరు. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ ప్రకారం అక్కినేని ఫాన్స్ కు శైలజారెడ్డినే. నాగ చైతన్య హీరోగా అను ఇమ్మానియేల్ జంటగా రూపొందుతున్న శైలజారెడ్డి అల్లుడు షూటింగ్ ఫైనల్ స్టేజి కి వచ్చేసింది. టాకీ పార్ట్ గతంలోనే పూర్తి చేసిన దర్శకుడు మారుతీ ఒక్క పాటను మాత్రం బాలన్స్ ఉంచాడు. విడుదలకు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో ముందు ప్లాన్ చేసిన క్రాబ్స్ ఐల్యాండ్ లో కాకుండా లొకేషన్ ను గోవాకు షిఫ్ట్ చేసారు. తేదీని ప్రకటించారు కాబట్టి సెన్సార్ తో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉంటాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్ మాత్రమే విడుదల చేసారు. సో ఒక్క పాటను మూడు రోజుల్లో పూర్తి చేసి ఆపై ప్రమోషన్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మారుతీ అండ్ కో డిసైడ్ అయినట్టుగా టాక్.మొదటిసారి శైలజారెడ్డి అల్లుడులో బాగా మాస్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్న చైతన్య దీని మీద చాలా హోప్స్ తో ఉన్నాడు. ఇప్పటి దాకా వచ్చిన ఫీడ్ ని బట్టి ఇది రెగ్యులర్ అత్తా అల్లుళ్ళ ఫార్ములాలో సాగే కథగా కనిపిస్తున్నప్పటికీ కామెడీని మాస్ కి మెచ్చేలా కమర్షియల్ గా తీయడంలో పట్టుకున్న మారుతీ ఆ విషయంలో సక్సెస్ అవుతాడనే నాగార్జున నుంచి చైతు దాకా అందరు బలంగా నమ్మకం పెట్టుకున్నారు. అలా అని శైలజారెడ్డి అల్లుడు పోటీ లేకుండా రావడం లేదు. ఒకరోజు అడ్వాన్స్ గా 30నే నాగ శౌర్య @నర్తనశాల వస్తుండగా దాని తాలూకు వీడియో సాంగ్ టీజర్ ఫస్ట్ లుక్ అన్ని ఈపాటికే విడుదలై పోయాయి. సో అల్లుడు టీమ్ ఇంకాస్త వేగం పెంచాలి. ఈ ఏడాది వస్తున్న చైతు మొదటి సినిమాగా కూడా అభిమానులు దీని నుంచి చాలా ఆశిస్తున్నారు. రమ్యకృష్ణ వేసిన అత్త పాత్ర మీసం పెంచిన చైతు మాస్ లుక్ ప్రధాన ఆకర్షణగా మారిన శైలజారెడ్డి అల్లుడు సక్సెస్ కావడం మారుతీకి చాలా కీలకం. పెద్ద హీరోలను సైతం డీల్ చేయగలను అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. గతంలో వెంకటేష్ తో చేసిన బాబు బంగారం ఫలితం ఇంకా చెరిగిపోని దృష్ట్యా మారుతీ ఎంతమేరకు జాగ్రత్త తీసుకున్నాడో తెలియాలంటే ఈ నెల 31దాకా వేచి చూడాలి.