ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ.. అక్కడ కపూర్ ఫ్యామిలీనా?

Wed Aug 17 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Naga Chaitanya about manam movie Bollywood Remake

అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున నాగచైతన్య అఖిల్ కలిసి నటించిన ఎవర్ గ్రీన్ మూవీ 'మనం'. టాలీవుడ్ లోనే కాకుండా దక్షిణాదిలో ఈ మూవీ సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఒక్క అమల తప్ప ఈ మూవీలో కింగ్ నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నటించడం విశేషం. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు నటించిన మెమరబుల్ ఫిల్మ్ గా టాలీవుడ్ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది.విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాత్రల పరంగా కథ కథనాల పరంగానూ యునిక్ స్క్రీన్ ప్లేతో ఇప్పటికీ టాప్ లో నిలిచింది. 2014 మే 23న విడుదలైన ఈ మూవీ సమయంలో హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమలో వున్నారు. ఆ తరువాతే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో వీరిద్దరి మధ్య కుదిరిని కెమిస్ట్రీ ఇద్దరి మధ్య వచ్చే సన్ని వేశాలు కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచి వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచాయి.

ఈ మూవీ వచ్చి దాదాపు ఎనిమిదేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే ఎలా వుంటుందనే ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవలే నాగచైతన్య వెల్లడించడం విశేషం. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మనం' బాలీవుడ్ రీమేక్ పై నాగచైతన్య పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చారు. హిందీలో ఈ మూవీని రీమేక్ చేస్తే ఎవరు సూటవుతారని అడిగితే వెంటనే రణ్ బీర్ కపూర్ పేరు చెప్పేశారట.

హిందీలో 'మనం'ని రీమేక్ చేస్తే మీ పాత్రకు ఎవరు కరెక్ట్ యాప్ట్ అనుకుంటున్నారని అడిగితే నా పాత్రలో రణ్ బీర్ కపూర్ అయితే కరెక్ట్ గా సూటవుతాడని చెప్పేశాడు. ఇక కార్తిక్ ఆర్యన్ '100% లవ్' కు సూటవుతాడని వరుణ్ ధావన్ 'తడాఖా' రీమేక్ చేసుకోవచ్చని స్పష్టం చేయమడం విశేషం. చై అన్నట్టు 'మనం' రీమేక్ కపూర్ ఫ్యామిలీ చేయాడం కష్టమే. ఎందుకంటే రణ్ బీర్ కపూర్ ఫాదర్ రిషీ కపూర్ ఇటీవలే చనిపోయారు. ఆయన లేకుండా బాలీవుడ్ 'మనం' కష్టమే.

ఇదిలా వుంటే ఇదే ఏడాది నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగచైతన్య కీలక అతిథి పాత్రలో బోడి బాలరాజుగా నటించాడు.

ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచి నాగచైతన్యకు తీవ్ర నిరాశ కలిగించింది. ప్రస్తుతం నాగచైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో బైలింగ్వల్ మూవీతో పాటు విక్రమ్ కె. కుమార్ తో 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.