చైతూ ప్రేమికుల రోజు గిఫ్ట్!

Thu Oct 10 2019 21:48:58 GMT+0530 (IST)

Naga Chaitanya Valentines Day Gift

నాగ చైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ జోడీ డాన్స్ బేస్డ్ నేపథ్యంతో  ప్రయోగం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలిసారి శేఖర్ కమ్ముల కొత్త జోనర్ కథని ఎంచుకున్నారు. దీంతో మజిలీ లాంటి క్లాసిక్ సక్సెస్ తర్వాత సరైన దర్శకుడే చైతూ చేతికి చిక్కాడని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు అంతకంతకు ఆలస్యమవుతుందని తాజా సన్నివేశం చెబుతోంది.ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి చైతూ `వెంకీ మామ` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా చిత్రీకరణ ఆలస్యమైంది. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుందన్న ప్రచారం సాగుతోంది. అయితే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాతనే కమ్ములా సినిమానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కుదరడం లేదు. డిసెంబర్ నాటికి ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడా ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తోంది.

డిసెంబర్ నాటికి చైతన్య-కమ్ముల కేవలం షూటింగ్ మాత్రమే పూర్తి చేగలరని... అటుపై కనీసం నెల రోజులైనా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం వెచ్చించాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ మార్పుతో డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరికి రిలీజ్ ని వాయిదా వేసినట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజం ఎంత? అన్నది దర్శక హీరోలు  వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు. ఇందులో చైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది.  చైతన్య-సాయి పల్లవి జంట తెలంగాణ యాస మాట్లాడే పాత్రల్లో కనిపించనున్నారు.