థాంక్యూ.. చైతూ మరో క్లాస్ సినిమా?

Wed Nov 24 2021 09:36:36 GMT+0530 (IST)

Naga Chaitanya Thankyou First Look

23 నవంబర్.. అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ అభిమానుల్లోకి దూసుకొచ్చింది. చైతన్య నటిస్తున్న `థాంక్యూ` ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఫెస్టివల్ లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు చై. అలా రంగుల రాట్నంలో గాల్లో తేలుతూ `యువ సామ్రాట్` ఉత్సాహభరితమైన మూడ్ లో ఉన్నాడు.ఇది విదేశీ లొకేషన్ లో సన్నివేశమని అర్థమవుతోంది. చైతన్య మార్క్ స్మైల్ ఈ పోస్టర్ లో మరో ఆకర్షణ. లవ్ స్టోరితో విజయం అందుకుని ఇప్పుడు మరో హిట్ కోసం చైతూ ఉవ్విళ్లూరుతున్నట్టే కనిపిస్తోంది.

విక్రమ్.కె కుమార్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా- మాళవిక నాయర్- అవికా గోర్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇది ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్. సినిమా ఆద్యంతం వినోదం పుష్కలంఆ ఉంటుందని దర్శకుడు తొలి నుంచి చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు. సీనియర్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇష్క్ తర్వాత పీసీ శ్రీరామ్ మరోసారి విక్రమ్ కె తో కలిసి విజువల్ గా మ్యాజిక్ చేస్తారని భావిస్తున్నారు.