అక్కినేని బుల్లోడు డబుల్ ట్రీట్

Thu Nov 21 2019 21:55:49 GMT+0530 (IST)

Naga Chaitanya Look In his NC19

అక్కినేని నాగచైతన్య కెరీర్ 18వ సినిమా వెంకీ మామ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా ప్యారలల్ గానే శేఖర్ కమ్ముల సినిమాపై దృష్టి సారించాడు చైతన్య. NC19 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ ని ప్రకటించాల్సి ఉందింకా.తాజాగా ఎన్.సి 19లో నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చై ఎంతో జోవియల్ గా కనిపిస్తున్నాడు. పైగా స్పోర్ట్స్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు. మజిలీలో కనిపించినట్టే గడ్డంతో కనిపించాడు. ఫంకీ హెయిర్ స్టైల్ తో ఇంకాస్త టీనేజీ యాటిట్యూడ్ అతడి పాత్రలో ఎలివేట్ అవుతోంది. ఏదో గెలిచినట్టే అతడిలో ఆ ఎగ్జయిట్ మెంట్ కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా టీజర్ ని శుక్రవారం ఉదయం 1.30కు రిలీజ్ చేయనున్నారు. ఆ మేరకు పోస్టర్ ద్వారా వివరాల్ని వెల్లడించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర ఎల్.ఎల్.పి సినిమాస్న- అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారంగ్ దాస్.కె. నారంగ్ - పి.రామ్మోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 23 నవంబర్ చైతూ బర్గ్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇది అనే చెప్పాలి. ఓవైపు వెంకీ మామ వీడియో ట్రీట్ తో పాటు ఎన్.సి 19 ట్రీట్ కూడా రెడీ చేస్తుండడం చైతూ ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది.