అక్కినేని హీరో జర జర పుటుక్కు మే!

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

Naga CHaitanya in Telugu Film Industry

సవ్యసాచి` పరాభవం తరువాత తేరుకున్న నాగచైతన్య `మజిలీ` సినిమాతో డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపుమీదున్న చై స్పీడు పెంచాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమబిజీ అయిపోయాడు. తాజాగా మామ వెంకీతో కలిసి `వెంకీమామ`లో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియాతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే తనకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న చైతూ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చిత్రానికి సిద్ధమవుతున్నాడు.రొమాంటిక్ డ్రామాగా తెరపైకి రాబోతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి నటిస్తోంది. ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ నారాయణదాస్ నారంగ్ పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే చై తన తండ్రి నాగార్జునతో కలిసి `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి రీమేక్ గా రానున్న `బంగార్రాజు` సీక్వెల్ లో నటించబోతున్నాడు. ఇందులో నాగచైతన్య ప్లేబాయ్ గా కనిపించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వున్న ఈ సినిమా నవంబర్ లో పట్టాలెక్కబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు.

ఇదిలా వుంటే `ఆర్.ఎక్స్ 100` ఫేం అజయ్ భూపతితో సినిమా క్యాన్సిల్ అని వార్తలు వచ్చినా అది కూడా లైన్ లోనే ఉందట. చై-భూపతి కాంబో `మహా సముద్రం` చిత్రాన్ని పట్టాలెక్కించనుందట. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభించి చిత్రాన్ని మిడ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మల్టీ స్టారర్ ఫిల్మ్. ఇందులో ఓ యంగ్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ లైనప్ చూస్తుంటే అక్కినేని హీరో స్పీడు అర్థం కావడం లేదూ.. జర జర కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నాడు కదూ?